ముంచిన ‘మిచౌంగ్‌’

ఉమ్మడి జిల్లాలో మిచౌంగ్‌ తుపాన్‌ బీభత్సం సృష్టించింది. కడప, అన్నమయ్య జిల్లాల్లో వేలాది ఎకరాలకు అపార నష్టాన్ని కలిగించింది. నీట మునిగిన వ్యవసాయ పంటలు, నేలకొరిగిన ఉద్యాన పంటలు, ఉధృత రూపం దాల్చిన వాగులు, వంకల ధాటికి రైతాంగంలో నిర్వేదం నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని రైల్వేకోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లి, పుల్లంపేట మండలాల్లోని పదుల సంఖ్యలో చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరింది. రైల్వేకోడూరులో 355 మి.మీ, కడప జిల్లాలోని ఒంటిమిట్టలో 142 మి.మీ గర్షిష్టంగా వర్షపాతం నమోదైంది. తుపాన్‌ దాటికి వ్యవసాయ, ట్రాన్స్‌కో, రెవెన్యూ, ఆర్‌అండ్‌బి శాఖలకు తీవ్ర నష్టం వాటిల్లింది.ప్రజాశక్తి – కడప ప్రతినిధి కడప, అన్నమయ్య జిల్లాలో17,638 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మూడు రోజుల కిందట పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుపాన్‌ సోమ, మంగళవారాల్లో జిల్లాపై ప్రభావాన్ని చూపించింది. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి కడప జిల్లాలో 12,384 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 1101 ఎకరాల్లో ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని 36 మండలాల్లో 28 మండలాల్లో పెనునష్టం వాటిల్లింది. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలపై పంజా విసిరింది. ఏడు మండలాల పరిధిలోని 171 మంది రైతులు సాగు చేసిన వరి, మిన ుములు, జొన్న, మొక్కజొన్న, అరటి, మిరప, టొబాకో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అత్య ధికంగా 8,939 ఎకరాల్లో వరి పంట నేలకొ రిగింది. రబీ సీజన్‌లో సాగు చేసిన పంటల విస్తీర్ణంలోని 9,687 ఎకరాల్లో వరి, మినుములు, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, మస్క్‌ మెలన్‌ పం టలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అత్య ధికంగా 1,815 ఎకరాల్లో మినుములు, 293 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి, రాజంపేట, నందలూరు, మండలాల పరిధిలోని 20గ్రామాల పరిధిలోని 358 ఎకరాల్లో వరి, 20 ఎకరాల్లో సుగర్‌కేన్‌, పంటలకు నష్టం వాటిల్లింది.నేలకొరిగిన ఉద్యానం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,254 ఎకరాల్లో ఉద్యాన పంటలు నేలకొరిగాయి. తుపాన్‌ తీవ్రతతోపాటు గాలుల బీభత్సం ధాటికి పండ్ల తోటలు నేల కొరగడం ఆందోళన కలిగి ంచింది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట, చింత కొమ్మదిన్నె, సిద్ధవటం, కాశినాయన, మైదుకూరు, బి.మఠం, బద్వేల్‌, ఖాజీపేట, అట్లూరు మండలాల్లోని 524 మంది రైతులకు సంబంధించి 1,101 ఎకరాల్లో పండ్లతోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 899 ఎకరాల్లో అరటి రైతులే కావడం గమనార్హం. బొ ప్పాయి, నిమ్మ, వంగ, మిరప, టమోటా కర్భూజ, ఉల్లి, తదితర పంటలు ఉన్నాయి. ఇదేతరహాలో అన్నమయ్య జిల్లాలో 4, 153 ఎకరాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం రాజంపేట, చిట్వేలి, కోడూరు, ఓబులవారిలిపల్లి, పెనగలూరు పుల్లంపేట, రామాపురం మండలాల్లో పరిధిలోని 79 గ్రామాల్లోని రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. అత్యధికంగా 398 ఎకరాల్లో అరటి, 87 ఎకరాల్లో బొప్పాయి, 93 ఎకరాల్లో బీటల్‌వైన్‌ పంటలు నష్టపోయాయి. ఆయా జిల్లాల వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేయడం గమనార్హం.1,814.2 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు ప్రజాశక్తి- రాయచోటి నాలుగు రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుపాను అన్నమయ్య జిల్లాను ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు జిల్లాలో గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం వల్ల వరి, అరటి, మిరప, చెరకు, టమోటా, బొప్పాయి చేతికొచ్చిన పంటలన్నీ నీటి పాల య్యాయి. చేతకొచ్చిన పంట చేయి జారిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రబీ సాధారణ సాగు భూమి 26238 హెక్టార్లు గాను 15,032 హెక్టార్లులో రైతులు సాగు చేశారు. తుపాను వర్షం కువరడంతో వ్యవసాయ పంటలకు సంబంధించి జిల్లాలో 153 హెక్టార్లుకు గాను రూ.170.28 లక్షలు నష్టం జరిగి నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మదనపల్లి మండ లంలో 80 హెక్టార్లు, రాజంపేట మండలంలో 10 హెక్టార్లు, నంద లూరు మండలంలో 55 హెక్టార్లు వరి పంట నష్టం జరిగింది. రాజంపేట మండలంలో 8 హెక్టార్లలో చెరుకు నష్టం జరిగింది. ఉద్యాన పంటలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 1661.2 హెక్టార్లకు 1954 మంది రైతులు నష్టపోయారు. రూ.4049.72 లక్షలు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. అరటి 13.2 హెక్టార్లు, బీన్స్‌ 4 హెక్టార్లు, చామంతి పువ్వులు 0.8 హెక్టార్లు, మ్యారిగోల్డ్‌ 1.2 హెక్టార్లు, టమోటా 6.4 హెక్టార్లు, కూరగాయల 0.8 హెక్టార్లు, అరటి 1557.6 హెక్టార్లు,, చామంతి పువ్వులు 1.6 హెక్టార్లు, తమలపాకు అకు తోటలు 37.2 హెక్టార్లు, బొప్పాయి 34.8 హెక్టార్లు, టమోటా 3.6 హెక్టార్లు నష్టపోయారని అధికారులు అంచనా వేశారు.పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు ధ్వంసం తుపాను కారణంగా జిల్లా వ్యాప్తంగా 33 కెవి ఫీడర్‌ 8,11 కె.వి. ఫీడర్‌ 22, 33/11 కెవి సబ్‌ స్టేషన్‌ 8, 11 కెవి పోల్స్‌ 23, ఎల్‌ టి పోల్స్‌ 27 నేలకొరిగాయి. రాయచోటి డివిజన్‌లో 11 కెవి పోల్స్‌ 3, ఎల్‌టి పోల్స్‌ 9, రాజంపేట డివిజన్‌లో 33 కెవి ఫీడర్‌ 8, 11 కెవి ఫీడర్‌ 4, 33/11 కెవి సబ్‌ స్టేషన్‌ 8, మదన పల్లి డివిజన్‌ లో 11 కెవి ఫీడర్‌ 7, 11 కెవి పోల్స్‌ 7, ఎల్‌ టి పోల్స్‌ 3 నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. పుల్లంపేట : తుపాన్‌ ప్రభావంతో మండల పరిధిలోని అనంతంపల్లి, రంగంపల్లి, రెడ్డిపల్లి తదితర గ్రామాలలో నేలకొరిగిన అరటి పంటను కలెక్టర్‌ గిరీష, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం త్వరనగతిన వారి ఖాతాల్లో జమ చేయిస్తానని వారు హామీ ఇచ్చారు. దెబ్బతిన్న పంటల పరిశీలన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి, వైసిపి నాయకులు కొల్లం గంగిరెడ్డి, ఎంపిపి ముద్ద బాబుల్‌రెడ్డి, తహశీల్దార్‌ నరసింహ కుమార్‌, రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ నవీన్‌ కుమార్‌, మండల సచివాలయాల కన్వీనర్‌ నాగిరెడ్డి హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రంలోని పుల్లంగేరు ఉదృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజుల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న ఈ తుఫాను ప్రభావం వల్ల ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు పుల్లంగేరు చేరుతుంది. రైల్వేకోడూరు : భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల దెబ్బ తిన్న అరటి, బొప్పాయ, మామిడి, తోటలను కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. ప్రతి ఏడాది భారీ వర్షాలు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పంట కోతకు వచ్చే సమయానికి ప్రకతి వైపరీత్యాలతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని వారిని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని వారు పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులు కలెక్టర్‌కు వివరించారు, పంట నష్టం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరారు. పంట నష్టం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి, స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ ముప్పాల హేమన వర్మ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుబ్బరామరాజు, ఓబులవారిపల్లి మండల కన్వీనర్‌ సాయి కిషోర్‌ రెడ్డి, జిల్లా టూరిజం డైరెక్టర్‌ సుధాకర్‌ రాజు, తహశీల్దార్‌ రామ్మోహన్‌, నరసింహ, పుల్లారెడ్డి, ఎంపిడిఒ విజయరావు, రఘు పాల్గొన్నారు. మండలంలో 349 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నందలూరు : మండలంలో వర్షానికి అరటి, వరి పండించిన రైతులు తీవ్రంగా నష్ట పోయారు. వక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి విద్యుత్‌ సరఫరా ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాటూరు, నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో 80 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లింది. నందలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాపురం గ్రామంలోని రైతు కనకరాజుకు చెందిన నాలుగు ఎకరాలలోని 6 వేల అరటి చెట్లు నేలకొరిగాయి. ఆడపూరు పంచాయితీ పరిధిలోని మర్రిపల్లె గ్రామంలో రైతు కొండా సుబ్బరాయుడు తన ఐదు ఎకరాలలో వేసిన వరి నారు నీట మునిగి రూ.20 వేలు నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లతిమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్లంరాజుపల్లెలో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు కూలిపోవడంతో ఆ గ్రామ సర్పంచ్‌ గీతాల శిరీష రెడ్డి, గీతాల నరసింహారెడ్డి యుద్ధప్రాధిక పదిన కూలిన చెట్టును తొలగించి, విద్యుత్తును సరఫరా చేయించారు. వీరబల్లి: తుపాన్‌తో మండలంలో అరటి, బొప్పాయి, పూల తోటలు, దెబ్బతిన్నాయి. గడికోట పంచాయతీ ఎడబల్లి, మాధవండ్లపల్లి, రెడ్డివారిపల్లి, పేరయ్యగారిపల్లి, పెద్దూర్‌ కస్పా, వేల్పులమిట్ట పలు ప్రాంతాల్లో, 28 ఎకరాల్లో బొప్పాయి, 34 ఎకరాల్లో అరటి, 5 ఎకరాల్లో వరి, నష్టం వాటిల్లింది. మూడు ఇండ్లు పడిపోయినాయి. బి.కొత్తకోట : మండలంలోని జనుపువారిపల్లిలో శ్రీరాములు అనే రైతు ఎకరా పొలంలో మొక్కజొన్న సాగుచేశాడు. తుపాన్‌ ప్రభావంతో మొక్కజొన్న పంట పూర్తిగా నేలకొరిగిందని, రూ.50 వేలు వరకు నష్టం వాటిల్లిందన్నారు. పాఠశాల ప్రహరీ కూలి దూడ మతిపీలేరు: పాఠశాల ప్రహరీ కూలి పేయదూడ మతి చెందిన సంఘటన పీలేరు మండలంలో చోటుచేసుకుంది. తుపాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు మంగళవారం మేళ్లచెరువు కస్పాలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రహరీ కూలిన ఘటనలో పేయదూడ మతి చెందినట్లు బాధితులు తెలిపారు. గ్రామస్తులు సహాయక చర్యలు చేపట్టి కూలిన గోడను తొలగించి, శిథిలాల కింద నిర్జీవమై పడి ఉన్న దూడను వెలికి తీశారు. సహాయక చర్యలు చేపట్టాలి : సిపిఎం తుపాను ముంచుకురావడంతో అన్నమయ్య జిల్లాలో ప్రజానీకం, ముఖ్యంగా రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోందని, ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరి కోతల సమయంలో వర్షాలు కురవడంతో మదనపల్లె, పీలేరు, తంబళ్ళపల్లి ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగిందని తెలిపారు. మొలకలు వచ్చి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో అరటి తోటలు నేలకొరిగి రైతులు నష్టపోయారన్నారు. ప్రభుత్వం స్పందించి తడిసిన, మొలకెత్తిన వరి ధాన్యాన్ని ఆర్‌బికెల ద్వారా కొనుగోళ్లు చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలబడి అవసరమైన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

➡️