ముంచిన మిచౌంగ్‌

అల్లవరం మండలం రెల్లిగడ్డ లో పంట పొలాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, మంత్రి విశ్వరూప్‌

 

ప్రజాశక్తి-యంత్రాంగం

గత కొద్ది రోజలుగా రాష్ట్రానికి వణికించిన మిచౌంగ్‌ తుపాను మంగళవారం తీరం తాటింది. తుపాను తీరం దాటినా భారీ వర్షాలు మరో 24 గంటలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ తుపాను డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అతలాకుతలమైంది. తుపాను ప్రభావంతో జిల్లా పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తుపాను ధాటికి జిల్లాలో రోడ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అమలాపురం : జిల్లాలో వరి కోతలు జోరుగా సాగుతున్న వేళ మిచౌంగ్‌ తుపాను రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. తుపాను ప్రభావంతో ఆదివారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వీస్తున్న ఈదురు గాలులకు వరిచేలు నేలకొరిగాయి. జిల్లాలో 1.68 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా 60 లక్షల ఎకరాల్లో ఇంకా వరి కోతలు పూర్తి కావాల్సి ఉంది. ధాన్యం మద్దతు ధరకు కొనుగోలుకు చర్యలుమిచౌంగ్‌ తుపాను ప్రభావంతో రంగు మారి తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వపరంగా కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసేందుకుచర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ పేర్కొన్నారు. అల్లవరం మండల పరిధిలో రెల్లు గడ్డ గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, తుపాను సహాయక చర్యల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, మంత్రి విశ్వరూప్‌ దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1లక్షా అయిదు వేల ఎకరాల్లో ఖరీఫ్‌ సీజన్‌ పంటలు నూర్పుళ్ళు జరిగి ధాన్యం కూడా రైస్‌ మిల్లులకు చేరిందన్నారు. 50వేల ఎకరాల్లో పంట ఉందని, దీనిలో 9,000 ఎకరాలు తుపాను ప్రభావంతో పంట దెబ్బతిన్నదని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పిస్తోందన్నారు. ప్రత్యేక అధికారి జి.జయ లక్ష్మీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు సమర్థవంతంగా చేపట్టారని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అల్లవరం మండలంలో ఇటీవల కాలంలో ముంపు తొలగింపునకు రూ.అయిదు కోట్ల మేర పనులు చేపట్టామ న్నారు. వాటి ఫలితంగా నేడు రామేశ్వరం మొగద్వారా సవ్యంగా నీరు సముద్రం లోనికి ప్రవేశిస్తుందన్నారు. తదనుగు ణంగా ఈ తుఫాను వల్ల మండల పరిధిలో ముంపు ప్రభావం చాలావరకు తగ్గిందన్నారు. సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో స్వర్ణ, 1318 రకాల పంటలు నీట మునిగాయన్నారు. తుపాను సహాయక చర్యల పర్యవేక్షణ కొరకు నియమింపబడ్డ జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి మంగళవారం మంత్రి పినిపే విశ్వరూప్‌, జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తో కలిసి స్థానిక కలెక్టరేట్లో కంట్రోల్‌ రూమ్‌ ద్వారా తుఫాన్‌ ప్రభావ స్థితిగతులను వారు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సిహెచ్‌.బాబు, కంట్రోల్‌ రూమ్‌ ఇంచార్జి సుమంత్‌ తదితరులు పాల్గొన్నారు.ఉపాధి హామీ కూలీలను తుపాను సహాయ చర్యలకు అనుసంధానంజిల్లాలో ఉపాధి హామీ అనుసంధానంతో మిచౌంగ్‌ తుపాను ముంపు సహాయక చర్యలు అధికారులు చేపట్టారు. జిల్లాలో ఉపాధి హామీ కూలీల అనుసం ధానంతో నీట మునిగిన వరి పొలాల లోని నీటిని డ్రైనేజీల ద్వారా కిందకి మళ్లించి, ,వరి పంట క్షేత్రాలలో ఉన్న వరి పనలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే పనులు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కోతలు పూర్తయిన వరి పనలను వర్షాల నుంచి రక్షించుకునేందుకు కుప్పలుగా వేసే సమయంలో ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్ప వేస్తే ధాన్యం పాడవకుండా ఉంటుదని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా.బి. భవానీ తెలిపారు. ఈ కోత కోసి చేలల్లో ఉన్న పనలపై గింజ మొలకెత్తకుండా లీటరు నీటికి 10 గ్రాముల ఉప్పు కలిపిన ద్రావణం పిచికారీ చేయాలి. కళ్లాల్లో ధాన్యం తడిస్తే రంగుమారి, చెడు వాసన వస్తుంది. దీనిని నివారించేందుకు క్వింటా ధాన్యానికి కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక కలిపి ధాన్యం పోగు చేయాలి. ముంపునకు గురైన చేలల్లో పైరును పనలుగా గుదుళ్లు కట్టుకుని నిలబెడితేధాన్యం రంగు మారకుండా, మొలకెత్తకుండా ఉంటుంది. పొలాల్లో నిలిచిన నీటిని గాడులు తీయడం ద్వారా బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలి.భారీ వర్షం వల్ల ఎంపిడిఒ కార్యాలయం మునకఐ.పోలవరం : మండలంలో వివిధ గ్రామాల్లో మిచౌంగ్‌ తుపాను ప్రభావం వల్ల వర్షంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం వద్ద వర్షం నీటిలో ఉండటం వల్ల కార్యాలయం సిబ్బంది,ప్రజలు కార్యాలయానికి రావటానికి ఇబ్బందిపడ్డారుప భారీ వర్షాలు వల్ల వరి పంట నేల మట్టంకావడంతో రైతులు ఆవేదన చెందు తు న్నారు. ఈదురుగాలులకు గ్రామాల్లో విద్యుత్‌సరఫరాకు అంతరాయం కలిగింది.తీరం అల్లకల్లోంరాజోలు : భారీవర్షాలకు పలు ప్రాంతాల్లో కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి. పలు రహదార్లు జలమయమయ్యాయి. సఖినేటిపల్లి మండలం లో మంగళవారం ఈదురు గాలులకు విద్యుత్‌ స్థంబాలు నెలకొరిగాయి.ఈదురుగాలులకు చిన్న లేగదూడ మృతి చెందింది. తుపాను ప్రభావంతో అంతర్వేది, శంకరగుప్తం, చింతలమోరి తదితర గ్రామాల్లోని సముద్రతీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సముద్రపోటు ప్రభావంతో ఉప్పునీరు తీరంవైపు సుమారు 30 మీటర్ల వరకు చొచ్చుకువచ్చింది. తుఫాను ప్రభావంతో సఖినేటిపల్లి మండలం అంతర్వేది హార్బర్లో 400 ఫిషింగ్‌ బోట్లను నిలిపి వేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో..రామచంద్రపురం : మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ధాన్యం రాశులు నీట మునిగాయి. పామర్రు పరిసర ప్రాంతాల్లో పంట పండించిన రైతులు ఇ క్కడ హై స్కూల్‌ గ్రౌండ్‌ లో ధాన్యం రాశులుగా పోసి నిలవచేసుకున్నారు. అయితే భారీ వర్షాలకు హైస్కూల్‌ గ్రౌండ్లోకి నీరు చేరడంతో ధాన్యం రాశులు మొత్తం ముంపునకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పామర్రు హై స్కూల్‌ గ్రౌండ్‌ కు చేరుకుని తడిసిన ధాన్యం రాశులు పరిశీలించారు అనంతరం ఇక్కడ రైతులతో మంత్రి మాట్లాడారు. ఇప్పటికే మిల్లర్లకు తడిసిన ధాన్యం పై పలు సూచనలు చేశామని ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆయన వెంట కె.గంగవరం తహశీల్దార్‌ వైద్యనాథ్‌ శర్మ పలువురు వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు రైతులు ధాన్యం ఎగుమతులు కొనసాగించారు.ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశంమామిడికుదురు : మిచౌంగ్‌ తుపానుకు నగరంలో నేలకొరిగిన వరిపంటచేలను ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు అధికారులతో పరిశీలించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరారు. ఎంఎల్‌ఎ స్పందించి తేమ తో సంబంధం లేకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అధికారులను అదేశించారు. మిచౌంగ్‌ తుఫాను వల్ల నష్టపోయిన వరి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్‌ చేశారు. మామిడి కుదురులో వర్షాల వల్ల నష్టపోయిన రైతులను మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కలసి రైతుల కష్టాలను తెలుసుకున్నారు. భారీ వర్షాలతో జల మయమైన లోతట్టు ప్రాంతాలను జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ కుమారి సం దర్శించారు. నీట మునిగిన పాశర్లపూడి లో సత్రరువు తోట, కృష్ణ శర్మ కాలనీ లను పరిశీలించి ముంపునీరు మళ్లించే చర్యలు చేప్పట్టాలని ఆదేశించారు. నీట మునిగిన పంట పొలాల పరిశీలనఅమలాపురం రూరల్‌ : మిచౌంగ్‌ తుపాను కారణముగా అమలాపురం మండలం బండారులంక గ్రామంలో నీట మునిగిన వరిచేలను గ్రామ సర్పంచ్‌ పెనుమల సునీత మంగళవారం పరిశీలించారు. రైతులందిరికీతగిన జాగ్రత్తలు తెలియపరిచి పంట నష్టపోయిన రైతులకి ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీ అందేలా పై అధికారులకు తెలియజేస్తానని అన్నారు. కార్యక్రమంలో అమలాపురం విస్తరణ అధికారి మల్లికార్జునరావు, ఎంపిడిఒ జె.వెంకటేశ్వరరావు, మండల వ్యవసయ అధికారి ధర్మ ప్రసాద తదితరులు పాల్గొన్నారు. కామనగరువు పంచాయతీ పరిధిలోని బాలయోగి కాలనీ తదితర ముంపు ప్రాంతాలను గ్రామ సర్పంచ్‌ నక్క అరుణ కుమారి చంద్రశేఖర్‌ మంగళవారం పరిశీలించారు. తామంతా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిలు నెలకొన్నాయని పలువురు సర్పంచ్‌ కు వివరించారు.ముంపు నీటిని త్వరగా బయటకు తీయాలని సర్పంచ్‌ పంచాయతీ సిబ్బందికి సూచించారు. జలమయమైన రావులపాలెం బస్టాండ్‌రావులపాలెం : తుఫాను నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు రావులపాలెం బస్టాండ్‌ జలమయమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రావులపాలెం మండలంలోని పంట పొలాలతో పాటు పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు రకాల పంటలు చేలలోనే వర్షపు నీటిలో నానుతూ కనిపించాయి.అహర్నిశలు శ్రమిస్తున్న విద్యుత్‌ సిబ్బందికొత్తపేట : మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో విద్యుత్‌ సమస్యలు తీవ్రమవుతున్నాయి. బలమైన గాలులు వీస్తుండడంతో చెట్ల కొమ్ములు విరిగిపడిపోతున్నాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలుతున్నాయి.ఈ సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా మండల పరిధిలోని పలుచోట్ల కొత్తపేట విద్యుత్‌ శాఖ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంట చేతికొచ్చినా తుఫాన్‌ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్‌ బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం శివారు చిన్నగూళ్ళ పాలెంలో నేలకొరిగిన పంటపొలాలను పార్టీ శ్రేణులతో కలసి పరిశీలించారు. వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు మండపేట : మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పట్టణ పరిధిలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టామని మున్సిపల్‌ శానిటరీ ఇన్స్పెక్టర్‌ లావణ్య అన్నారు. మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో మండపేట, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా మండపేట-తాపేశ్వరం, మండపేట – ఏడిద రోడ్లు చెరువులు తలపిస్తుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అరటిపంటకు అపార నష్టంఆత్రేయపురం : తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు వరి పంట నేలకొరిగి నీటిలో నానుతోంది. వర్షపు నీరు ముందుకు వెళ్లే దారి లేకపోవడంతో రైతులు తమ పంటను కాపాడుకునేందుకు ప్రత్యయము మార్గాలతో నీటిని మళ్లించు కుంటున్నారు. అరటి పంటకు అపార నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు అరటి చెట్లు నేలలుంటాయి. అలాగే పల్లవి ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నీట మునిగిన చేలను పరిశీలించిన ఆర్‌ డి ఒ ఉప్పలగుప్తం : తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన పరిచేలను అమలాపురం ఆర్‌డిఒ కె.కేశవవర్ధన్‌ రెడ్డి పరిశీలించారు. తహశీల్దార్‌ జవ్వాది వెంకటేశ్వరి ఆధ్వర్యంలో యంత్రాల సాయంతో భీమనపల్లి, నంగవరం, సన్నవిల్లి ఆయకట్టులోని ముంపు నీరు తొలగింపు చర్యలు చేపట్టారు. సన్నవిల్లిలో ఆక్వా చెరువుల కారణంగా వరి చేలల్లోని ముంపు నీరు దిగడం లేదంటూ ఆ గ్రామానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లు కాట్రేనికోన : మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో కాట్రేనికోన మండలలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొప్పుగుంటలో కొబ్బరి చెట్లు పడిపోవడంతో ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది చెట్లను తొలగించారు. నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలను ఎలక్ట్రికల్‌ ఎఇ బి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది విద్యుత్‌ స్తంభాలను నిలబెడుతూ విద్యుత్‌ పునరుద్దరణ పనులు వేగంగా చేస్తున్నారు. ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌ మంగళవారం కొప్పిగుంట గ్రామంలో పర్యటించారు. తడిసిన ధాన్యం రాశులు కపిలేశ్వరపురం : తుఫాను కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పలు ప్రాంతాల్లో ని చేలల్లో వేసిన వరి ధాన్యం రాసులు ,రోడ్ల వెంబడి ఆరబోసిన ధాన్యం రాశులు , తడిసి ముద్దయ్యాయి.నీట మునిగిన పంట పొలాల పరిశీలన ముమ్మిడివరం : తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని జెసి నుఫూర్‌ అజరు హామీ ఇచ్చారు. రాజుపాలెం, అన్నంపల్లి మరియు చిన కొత్తలంక తదితర గ్రామాల్లో భారీ వర్షాలకు తడిసి నీట మినిగిన వరి పంట పొలాలను, ధాన్యం రాశులనుపరిశీలించారు. ముమ్మిడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్‌ కుమార్‌ సిహెచ్‌.గున్నేపల్లి, గాడిలంక గ్రామాల్లో పర్యటించి పంట పొలాలను ధాన్యం రాశులను పరిశీలించారు. కార్యక్రమంలో నగరపంచాయతీ ఛైర్మన్‌ కమిడీ ప్రవీణ్‌ కుమార తదితరులు పాల్గొన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: కారెం వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-అమలాపురం జిల్లాలో మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తేమ శాతం చూడకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిబంధనలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా నిబందనలను సడలించి తేమ పేరుతో కేజీలు కోత లేకుండా మొత్తం ధాన్యాన్ని రైతుల కళ్లాల్లోనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని డిమాండ్‌ చేశారు. పడిపోయిన పంటచేలకు పంట నష్టం అంచనా వేయాలని డిమాండ్‌ చేశారు. మిచౌంగ్‌ తుపాను ప్రబావావంతో కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని వారందరికి ప్రభుత్వం నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పునరావస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు సౌకర్యం కల్పించాలన్నారు.

 

➡️