ముందస్తు సంక్రాంతి సంబరాలు

Jan 9,2024 19:10
సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులు

సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులు
ముందస్తు సంక్రాంతి సంబరాలు
ప్రజాశక్తి -పొదలకూరు :పొదలకూరులోనిసాంస్కతిక కార్యక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా గాయత్రి విద్యామందిర్‌ నిలిచిందని జెడ్‌పిటిసి తెనాలి నిర్మలమ్మ పేర్కొన్నారు. మంగళ వారం స్థానిక శ్రీ గాయత్రి విద్యామందిర్‌లో ముందస్తు సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. జెడ్‌పిటిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్‌ ప్రాంగణమంతా కల్లాపి చల్లి రంగవల్లికలతో నింపారు. చిన్నారులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ఆటపోటీలు, వ్యాసరచన పోటీల్లో గెలు పొందిన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు పతంగులు ఎగురవేశారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు సంక్రాంతి పండుగ విశిష్టత గురించి వివరించారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్ర మంలో కరస్పాండెంట్‌ చైతన్య కుమార్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ చంద్రబాబు, ఏడు కొండలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

➡️