ముంపు బాధితులకు పూర్తి సహకారం : కలెక్టర్‌

ప్రజాశక్తి-ఓబులువారిపల్లి మంగంపేట ముంపు బాధితులకు కేటాయించిన అర్‌అర్‌-5 లేఅవుట్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు. సోమవారం మండలంలోని మంగంపేట గ్రామ పంచాయతీ కాపువల్లి, అరుందతివాడ, హరిజనవాడ ముంపు బాధితులకు కేటాయించిన ఆర్‌ఆర్‌-5, లే అవుట్‌ను కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మంగపేట ముంపు బాధితులకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని పేర్కొన్నారు. మంగంపేట గ్రామ పంచాయతీ కాపువల్లి, అరుందతివాడ, హరిజనవాడ గ్రామాలలో గ్రామస్తుల కోరిక మేరకు లేఅవుట్లో అన్ని మౌలిక వసతులు కల్పించి సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ లేఅవుట్‌లో సిసి రోడ్డు, డ్రెయినేజీ, పాఠశాల భవనం, శ్మశాసవాటిక, పార్క్‌ తదితర మౌలిక వసతులన్నీ లేఅవుట్‌లో కల్పిస్తామన్నారు. నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రతి ఇంటికి కులాయి కనెక్షన్‌ ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇక్కడ జరిగే ప్రతి పని క్వాలిటీగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కాలనీలో విశాలమైన రోడ్లు, కిరువైపులా గ్రీనరీ ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంపొందిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ మంగంపేట బెరైటీస్‌ గనులను పరిశీలించారు. కార్యక్రమంలో రాజంపేట ఆర్‌డిఒ మోహన్‌రావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లీలారాణి పాల్గొన్నారు.

➡️