ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత

Feb 17,2024 21:32
ఫొటో : చెక్కులు అందజేస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : చెక్కులు అందజేస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : అనారోగ్య కారణాలతో వైద్యం చేయించుకుని ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న ఓ బాధితుడికి శనివారం ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధిని అందజేశారు. మర్రిపాడు మండలానికి చెందిన కన్నెలూరి వెంకటరమణయ్య అనారోగ్య కారణాలతో వైద్యం చేయించుకోవడంతో ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని, అతనని ఆదుకోవాలని స్థానిక నాయకులు ఎంఎల్‌ఎ మేకపాటికి తెలిపారు. స్పందించిన ఎంఎల్‌ఎ మేకపాటి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1.10లక్షలను మంజూరు చేయించి శనివారం ఆత్మకూరులో జరిగిన కార్యక్రమంలో బాధితుడికి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు చేయించడంపై ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డికి, మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కన్వీనర్‌ గంగవరపు శ్రీనివాసులు నాయుడు, భీమవరపు సొసైటీ చైర్మన్‌ సోమల మాధవరెడ్డి, మండల జెసిఎస్‌ కన్వీనర్‌ సిద్ధంరెడ్డి మోహన్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ సుబ్బిరెడ్డి, మండల బూత్‌ లెవెల్‌ మేనేజర్‌ రేవూరు వేణుగోపాల్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️