ముగిసిన అటల్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

ప్రజాశక్తి- డెంకాడ : ఎంవిజిఆర్‌ సివిల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఐసిటిఇ స్పాన్సర్‌ చేసిన 6 రోజుల అటల్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ శనివారం ముగిసింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎం.వి.జి.ఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఆధ్వర్యంలో భవిష్యత్తు ట్రెండ్‌లపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నై ఎల్‌అండ్‌టికి చెందిన దాసం కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ దాసమ్‌, మల్టీడిసిప్లినరీ టీమ్‌ల మధ్య మెరుగైన సహకారం ద్వారా ప్రాజెక్ట్‌ నిర్వహణను మార్చడంలో బిఐఎం సాఫ్ట్వేర్‌ యొక్క కీలక పాత్రను వివరించారు. డిజైన్‌, విశ్లేషణ యొక్క సామర్థ్యాన్ని నొక్కిచెబుతూ, వివరణాత్మక 3డి నమూనాలు తయారీలో దీని పాత్రపై చెప్పారు. ఈ వాలిడెక్టరీ ఫంక్షన్‌లో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ పి.మార్కండేయ రాజు, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ మురళీ సాగర్‌ వర్మ సాగి, కన్వీనర్‌, హెచ్‌ఒడిలు, సివిల్‌ ఇంజినీరింగ్‌ అధ్యాపకులు, పీజీ విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️