ముగిసిన ఖాదర్‌ బాబా గంధ మహోత్సవాలు

Feb 22,2024 19:49

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : హజరత్‌ సయ్యద్‌ ఖాదర్‌ వలీ బాబా 65వ ఉరుసు మహోత్సవాలు గురువారం ముగిశాయి. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ ఉత్సవాల్లో దేశ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు ఖాదర్‌ బాబా దర్గాలో సుగంధ, చాదర్‌ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సూఫీ పరంపర మహనీయులను స్మరించుకుంటూ విశ్వ శాంతి కోసం దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనేక మంది ప్రముఖులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఖాదర్‌ బాబా దర్గా, దర్బార్‌ షరీఫ్‌ కు విచ్చేసి దర్శనం చేసుకున్నారు. మూడు రోజుల పాటు నిర్వీ్షమంగా నిర్వహించిన భారీ లంగర్‌ ఖానాలో లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సూఫీ పీఠాధిపతి హజరత్‌ ముహమ్మద్‌ అతావుల్లా షరీఫ్‌ షా తాజ్‌ ఖాదరీ బాబా వారి అధ్యాత్మిక వారసుడు, సజ్జాద నషీన్‌ ముహమ్మద్‌ ఖాజా మోహియుద్దీన్‌ షా ఖాదరి విశ్వ శాంతిని కాంక్షిస్తూ, ప్రేమ తాత్వాన్ని ప్రభోదిస్తూ భక్తులకు తమ సందేశాన్ని అందించారని దర్గా దర్బార్‌ ధర్మకర్త ఖలీల్‌ బాబు తెలిపారు.

➡️