ముగిసిన మాతృభాషా వాలంటీర్ల ధర్నా

ముగిసిన మాతృభాషా వాలంటీర్ల ధర్నా

ప్రజాశక్తి -పాడేరు : మాతృభాష వాలంటీర్లను రెన్యువల్‌ చేయాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్‌, జిల్లా ఉపాధ్యక్షులు పి.లక్కు డిమాండ్‌ చేశారు. ఈనెలాఖరుతో ముగస్తున్న తమ నియామక గడువును ఏప్రిల్‌ నెలాఖరు వరకు పొడిగించాలని కోరుతూ మాతృభాషాఉపాధ్యాయల సంఘం అల్లూరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల ధర్నా ముగింపు సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో 676 మంది మాతృభాష విద్యా వాలంటీర్లు నేటివ్‌ స్పీకర్స్‌గా పనిచేస్తున్నారని, వీరి సేవలను రెన్యువల్‌ చేయడం, సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, ఐటిడిఎ యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. వీరి న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆదివాసీ గిరిజన సంఘం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మాతృభాషా ఉపాధ్యాయుల సంఘం పోరాటానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నయ్య పడాల్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, కొర్రా శ్రీను, జిల్లా నాయకులు చంద్రయ్య, సత్తిబాబు, చంద్రమ్మ, చిన్నమ్మ పాల్గొన్నారు.

దీక్ష విరమింపజేస్తున్న పొద్దుబాలదేవ్‌

➡️