మున్సిపల్‌ కార్మికుల ధర్నా

Dec 19,2023 18:53
కార్మికుల నిరసన ప్రదర్శన దృశ్యం

కార్మికుల నిరసన ప్రదర్శన దృశ్యం
మున్సిపల్‌ కార్మికుల ధర్నా
ప్రజాశక్తి -నెల్లూరు ప్రభుత్వం మునిసిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయకపోతే ఈ నెల 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని ఎపి మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియూ ) జిల్లా కమిటీ హెచ్చరించింది. మంగళవారం నగర పాలక సంస్తలో పనిచేస్తున్న మునిసిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని మస్టర్‌ పాయింట్ల వద్ద ధర్నాలు చేశారు. తొలుత 5,6,7, 8,9 డివిజన్లలో పారిశుధ్య కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ పర్మినెంట్‌ కోరుతూ కార్మికులు చేస్తున్న పోరాటానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మున్సిపల్‌ కార్మికులకు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులందరినీ అధికారంలోకి రాగానే పర్మినెంట్‌ చేస్తారని వాగ్దా నం చేశాడన్నారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు. మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న పోరాటానికి ఐద్వా, డివైఎఫ్‌ఐ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి. సూర్యనారా యణ, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి బిపి నరసింహ, ఐద్వానగర కార్యదర్శి కత్తి పద్మ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎం.అశోక్‌,ఆర్‌ ఏం సునీల్‌,ఎం శ్రీనివాసులు, భాగ్యమ్మ,కొండమ్మ కామాక్షమ్మ,సలోమి, లోకేష్‌, జయకుమార్‌, నాగేశ్వరావు ఉన్నారు.

➡️