మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.సుందర్‌బాబు డిమాండ్‌ చేశారు. బుధవారం మున్సిపల్‌ కార్మికుల రెండో రోజు సమ్మె శిబిరంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి వారికి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. రూ.26 వేల జీతం ఇస్తామని చెప్పారు, కానీ చేయలేదని, మున్సిపల్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తామని చేయలేదని, ఇంజినీరింగ్‌ కార్మికులందరికీ జిఒ నెంబర్‌ 7 ప్రకారం వేతనాలు ఇస్తామని ప్రకటించి, ఇవ్వలేదని చెప్పారు. స్థానికంగా మున్సిపల్‌ కార్మికుల ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. పరిష్కారం చేయకపోతే తప్పని పరిస్థితిలో మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేయడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమని తెలిపారు. ఇప్పుడైనా మున్సిపల్‌ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల బృందం సురపనేని చిన్ని, బొండాడ సత్యనారాయణ, మురుకొండ రమాదేవి, పాలూరి నీలిమ, కండెల్లి రామారావు, కిలాని వీర వెంకటలక్ష్మి, బిజెపి కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ సమ్మెకు మద్దతు తెలిపారు. కౌన్సిల్లో కార్మికుల సమస్యలు ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజన్న అప్పారావు, మాండ్రు సుధీర్‌, మీసాల కిషోర్‌, మీసాల ప్రేమ్‌, వడ్డాది శ్యామ్‌, పూజారి వాసు, కారంకి ప్రసాద్‌, భూపతి రవీంద్ర, మీసాల జ్యోతి, కల్యాణ్‌ రాజేష్‌, ఎం.శకుంతల పాల్గొన్నారు.

➡️