ముమ్మరంగా పారిశుధ్య పనులు

Feb 26,2024 21:26
ఫొటో : పారిశుధ్య పనులు చేపడుతున్న సిబ్బంది

ఫొటో : పారిశుధ్య పనులు చేపడుతున్న సిబ్బంది
ముమ్మరంగా పారిశుధ్య పనులు
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ గోపీనాథ్‌ ఆదేశాల మేరకు ఇర్లపాడులో సర్పంచ్‌ గుర్రం శ్రీనివాసులు యాదవ్‌ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సోమవారం ప్రత్యేక పారిశుధ్య పనులను చేపట్టారు. గ్రామంలోని ప్రధాన వీధులలో చెత్తను తొలగించి శుభ్రం చేసి, నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లారు. దోమలు వ్యాప్తి చెందకుండా ప్రజలు తమఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. తడి, పొడి చెత్తకు డస్ట్‌బిన్లను వాడి పర్యావరణం కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు. నీటి తొట్టెలు, బకెట్లు, టైర్లు, ప్లాస్టిక్‌ వస్తువుల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమల వ్యాప్తి చెందుతాయని నీళ్లు నిల్వ లేకుండా తగు జాగ్రత్త తీసుకోవాలన్నారు. నీటి గుంతల్లో దోమలు వ్యాప్తి చెందకుండా ఆయిల్‌ బాల్స్‌ వేశారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో వైద్య, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️