మెరుగైన పాలన జగన్‌తోనే సాధ్యం

ప్రజాశక్తి- శృంగవరపుకోట : మెరుగైన పాలన జగన్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. 296వ రోజు ఆదివారం పట్టణంలోని సచివాలయం-1 పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతి గడపకూ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే తెలుసుకొని అక్కడికి అక్కడే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ, నాలుగేళ్ళలో అందించిన పథకాలు గురించి వివరించి మరోసారి తనను, జగన్మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి పినిశెట్టి వెంకటరమణ, స్టేట్‌ ఫోక్‌ అండ్‌ కల్చరల్‌ డైరెక్టర్‌ వాకాడ రాంబాబు, వైసిపి మండల అద్యక్షుడు మోపాడ కుమార్‌, పోతనపల్లి సర్పంచ్‌ కూనిరెడ్డి వెంకటరావు, ఆవాల కృష్ణ, వార్డు సభ్యులు మజ్జి శేఖర్‌, యలమంచిలి అప్పారావు, కొత్తూరు ఉల్లి శంకర్‌, తలారి అనంత్‌, మోపాడ కోటి, సీతంపేట అప్పలసత్యం, చింతల నారాయణమూర్తి, సరిపల్లి గణేష్‌, మాడెం వెంకటేష్‌, కోడూరు శ్రీను, సింహాచలం, సోషల్‌ మీడియా కో కన్వీనర్‌ మామిడి బుజ్జి, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

➡️