మేకపాటితోనే ఉదయగిరి అభివృద్ధి

Nov 25,2023 21:19
ఫొటో : పట్టణంలో పర్యటిస్తున్న జిల్లా కోఆప్షన్‌ సభ్యులు గాజుల తాజుద్దీన్‌

ఫొటో : పట్టణంలో పర్యటిస్తున్న జిల్లా కోఆప్షన్‌ సభ్యులు గాజుల తాజుద్దీన్‌
మేకపాటితోనే ఉదయగిరి అభివృద్ధి
ప్రజాశక్తి-ఉదయగిరి : ఉదయగిరి పట్టణ అభివృద్ధి ఒకేఒక్క నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డితోనే సాధ్యమవుతుందని జిల్లా కోఆప్షన్‌ సభ్యులు, మండల అధ్యక్షులు గాజుల తాజుద్దీన్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక పట్టణంలో మేకపాటి రాజగోపాల్‌రెడ్డి సూచనల మేరకు సినిమా హాల్‌ వీధి, మంగలి కట్ట, శ్రీనగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అత్యధికంగా డ్రెయినేజీ కాలువలు, సిసి రోడ్లను, పారిశుధ్యం, కుక్కల బెడద సమస్యలను పరిష్కరించాలని ఆయన దృష్టికి స్థానికులు నాయకులు, కార్యకర్తలు తెలిపారు. సమస్యలు పరిష్కరించడానికి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి దృష్టి తీసుకువెళ్లి ఆయన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా నాయకులు మట్ల లక్ష్మయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

➡️