మోకాళ్లపై నిల్చొని నిరసన

ప్రజాశక్తి-చీమకుర్తి : సమ్మెలో భాగంగా మున్సిపల్‌ కార్మికులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ఉపాధ్యక్షుడు ఇట్టా నాగయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు కార్మికులతో నమ్మకంగా చర్చలు జరుపుతూనే మరోవైపు వారిపై నిర్భంధాన్ని ప్రయోగి స్తుందన్నారు. చీమకుర్తిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులను అరెస్టు చేయడమే అందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం పారిశుధ్య కార్మికులను అరెస్టు చేయడమంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమేనన్నారు.ప్రభుత్వం భేషజాలకు పోకుండా కార్మికుల సమస్యలను పరిష్కరిం చాలన్నారు. ఈ కార్యక్ర మంలో యూనియన్‌ నాయకులు పి.ఏడుకొండలు, పి.పద్మ, తప్పెట నరసయ్య, కోటేశ్వరి, చెన్నమ్మ, రాధ, సురేఖ, వెంక టేశ్వర్లు, బ్రహ్మాయ్య, విజయ, గోవిందు, దాసు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం రూరల్‌ : సమ్మెలో భాగంగా మున్సిపల్‌ కార్మికులు అన్ని రకాల సేవలను స్తంభింపజేశారు. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతుగా ఎఐటియుసి అనుబంధ సంఘం పారిశుధ్యకార్మికులు బుధవారం విదులు బహిష్కరించారు. కార్మికుల సమ్మెలకు ఎఐటియుసి జిల్లా నాయకులు అందే నాసరయ్య, సిఐటియు జిల్లా నాయకులు దగ్గుపాటి సోమయ్య సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుందన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కె. సుబ్బరాయుడు, మార్కాపురం యూనియన్‌ నాయకులు గొట్టం హరికష్ణ, మహేష్‌, ఇమామ్‌ సాహెబ్‌, సలాం ఖాన్‌, వెంకట సుబ్బయ్య ,బ్రహ్మం, శానిటరీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వేమా వెంకటేశ్వర్లు, హరి, గొట్టిముక్కల బాబు, ఎఐటియుసి జిల్లా నాయకులు ఎస్‌కె. కాసిం తదితరులు పాల్గొన్నారు.

➡️