మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ను అమలు చేయాలి

Mar 18,2024 21:52

ప్రజాశక్తి -బలిజిపేట : ఎన్నికల షెడ్యూలు విడుదలైన దృష్ట్యా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ను అమలు చేయాలని మండల 31వ సెక్టార్‌ ఆఫీసర్‌ సామల సింహాచలం అన్నారు. సోమవారం 31వ సెక్టార్‌ పరిధిలోని పెదపెంకిలో గల ఏడు పోలింగ్‌ కేంద్రాలను బిఎల్‌ఒలతో కలిసి పరిశీలించారు. గ్రామమంతా కలియతిరిగి ఎన్నికల నియమావళి ప్రకారం రాజకీయ పార్టీల పోస్టర్లు, జెండాలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా తొలగించారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయించారు. అనంతరం బిఎల్‌ఒలతో సమావేశ మై మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ ను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో బిఎల్‌ఒలు రామారావు, తిరుపతిరావు, అశోక్‌, చంటి తదితరులు పాల్గొన్నారు.కదిలిన అధికారి యంత్రాంగం వీరఘట్టం : సాధారణ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో సోమవారం అధికారి యంత్రాంగం వీరఘట్టంలో పర్యటించింది. అన్ని వీధుల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు, స్టిక్కర్లు, బ్యానర్లను తొలగించారు. అలాగే స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలోని ఎంపిడిఒ ఛాంబర్‌లో గల సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిత్రపటం తొలగించారు.

➡️