మోత మోగించిన అంగన్వాడీలు

Dec 26,2023 15:04 #Kakinada

ప్రజాశక్తి-తాళ్లరేవు(కాకినాడ) : తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీలు తాళ్ళరేవు తహశీ కార్యాలయం ఎదురుగా కంచాలు, గరిటెలతో శబ్దాలు చేసి మోత మోగించారు. అంగన్వాడీల కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కంచాలపై గరిటలతో కొడుతూ పెద్ద ఎత్తున శబ్దాలు చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలనీ వారు కోరారు. మంగళవారం సమ్మెకు యూనియన్‌ నాయకులు పి . ఆదిలక్ష్మి, ఉషారాణి, శ్రీదేవి, పార్వతి నాయకత్వం వహించగా వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు దుప్పి అదృష్టదీపుడు మద్దతుగా నిలిచారు.

➡️