మోసపోతే ఆంథకారమే

వైసిపికి ఓటేయకపోతే సంక్షేమానికి పాతరేచిన్నాన్న హంతకునికి మద్దతు ఇస్తున్నదెవరో అందరికీ తెలుసుపేదల శత్రువులను ఓడించాలని పిలుపుమేమంతా సిధ్ధం సభలో వైఎస్‌.జగన్మోహన్‌రెడ్టిప్రజాశక్తి-కడప ప్రతినిధి/ప్రొద్దుటూరు/వేంపల్లె/ఎర్రగుంట్లకేంద్రంలోని బిజెపి, టిడిపి, జనసేన పొత్తు పేరుతో మరోసారి పేదలను మోసగించడానికి ముందుకొచ్చాయని, మోసపోతే సంక్షేమాన్ని గంగలో కలపడం ఖాయమని వైసిపి అధ్యక్షులు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలోని ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసిన అనంతరం రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. వేంపల్లి, వీరపునాయునిపల్లి, యర్రగుంట్ల మండలాల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరు నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభివృద్ధికి అడ్డు పడుతున్న దుష్టచతుష్టయంపై అర్జునుడిలా గాండీవం పూరించానన్నారు. ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన వాళ్లనే చంద్రబాబు తన మీద ఉసిగొల్పుతున్నారని తెలిపారు. వివేకా చిన్నాన్నను అన్యాయంగా అతిదారుణంగా చంపారన్నారు. ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు, చంపిన హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడని, ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారని పేర్కొన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, ఎల్లో మీడియా కాదా అని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం తపించిపోతున్న ఒకరిద్దురు నావాళ్లు భాగమయ్యారన్నారు. ఇంతటి దారుణం చేసి నన్ను దెబ్బ తీయాలనుకుంటున్నారని చెప్పారు. ఇంత కన్నా అన్యాయం ఉంటుందా అని తెలిపారు. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం చేసినా నేను మాత్రం ప్రజల పక్షం ఉంటానన్నారు. నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారని చెప్పారు. అందరూ కలిసి జగన్‌పై యుద్ధానికి వస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బిజెపి, కాంగ్రెస్‌ నాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారన్నారు. ఇది చాలదన్నట్లు నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారన్నారు. నేను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నానన్నారు. చంద్రబాబు బృందానికి నమ్మించి నట్టేట ముంచేందుకు 45 ఏళ్ల అనుభవం ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు అవగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడంలో అనుభవం సంపాదించాడన్నారు. గోబెల్స్‌ ప్రచారంలోనూ, కుటుంబాలను చీల్చడంలోనూ అనుభవం గడించారని విమర్శించారు. 2014లో ఇదే కూటమి మేనిఫెస్టో ఎన్నికలు అవగానే వెబ్‌సైట్‌ దగ్గర నుంచి ఎక్కడా కనిపించకుండా చేసిన ఘనత వారిదని ఎద్దేవా చేశారు. 58 నెలల వ్యవధిలో రాష్ట్ర చరిత్రలో ఎవరూ చూడని, ఊహించని విధంగా పాలన సాగించామని తెలిపారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానికి, పట్టణాలకు వెళ్లినా సచివాలయం, విలేజ్‌ క్లినిక్‌, ఆర్‌బికెలు కనిపిస్తాయని, ఎక్కడి సమస్యను అక్కడ పరిష్కరించడానికి పోలీస్‌ సోదరులను కూడా నియమించామని తెలిపారు. మున్సిపాలిటీలు మొదలుకుని స్థానిక సంస్థలన్నింట్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించామని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2.30 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. 80 శాతం నా అని పిలిచే ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలే ఉద్యోగులుగా ఉన్నారన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, 22 లక్షల ఇళ్లు నిర్మాణ దశల్లో ఉన్నాయని, ఇవి పూర్తి చేసిన వెంటనే ఐదు లక్షల నుంచి 25 లక్షల ఆస్తి ఆడబిడ్డలు చేతిలో పెట్టినట్లు అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాలలు, రూ.1600 కోట్లతో నాలుగు సీపోర్టులను, రూ.3300 కోట్లతో 10 పిషింగ్‌ హార్బర్స్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి పెద్దపెద్ద పారిశ్రామిక సంస్థలు క్యూ కడుతున్నాయన్నారు. 58 నెలల వ్యవధిలో 130 సార్లు రూ.2.30 లక్షల కోట్లు మేర బటన్‌ నొక్కానని, మీరు నాకోసం రెండు బటన్లు నొక్కాలని విజ్ఞప్తి చేశారు. అమ్మఒడి, చేయూత, సున్నావడ్డీ, నేతన్ననేస్తం, రైతుభరోసా,డ్వాక్రా, కాపునేస్తం, ఇబిసి నేస్తం, వాహనమిత్ర, చేదోడు,తోడు వంటి పథకాలు కొనసాగాలంటే జగన్‌క ఓటేమని చెప్పాలని కోరారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలకీë పథకం మొదలుకుని రైతు రుణమాపీ, పొదుపు సంఘాల రుణమాఫీ, ఇంటింటికీ ఉద్యోగం ఇస్తామని, ఇవ్వకపోతే రూ.3 వేలు భృతి ఇస్తామని, రూ.10 వేల కోట్లతో బిసి సబ్‌ప్లాన్‌, ప్రతి పట్టణాన్ని హైటెక్‌ సిటీ చేస్తామని, ప్రతిఒక్కరికీ మూడు సెంట్ల ఇళ్లస్థలం ఇస్తానని హామీలు ఇచ్చారని, మీకెవరికైనా, గానీ మీ ఇరుగుపొరుగువారికైనా వచ్చిందా అని అడిగారు. మేనిఫెస్టోలోని ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. మరోసారి ఇదేబ్యాచ్‌ మీ ముందుకు వస్తోందని, మేనిఫెస్టోలో ఇంటింటికీ సూపర్‌సిక్స్‌ పేరుతో మోసానికి సిద్ధమయ్యాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, రవీంద్రనాధరెడ్డి, ఎం.వి సుధీర్‌రెడ్డి, డాక్టర్‌ సుధ, అంజాద్‌బాషా, జింకా విజయలకీë, డిసిసిబి ఛైర్మన్‌ ఝాన్సీ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బి.లకీëరెడ్డి, పలువురు నాయకులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

➡️