యాదవుల ఓట్లు కోసమే యాగీ!

యాదవ సంఘాల ఐక్యవేదిక

ప్రజాశక్తి – ఆరిలోవ : నగరంలో యాదవుల ఓట్ల కోసమే హడావిడిగా యాదవ భవనానికి శంకుస్థాపన, వరాలు ప్రకటన వంటి యాగీ చేస్తున్నారని విశాఖ జిల్లా యాదవ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ ప్రసాదాల భాగ్యానంద్‌ ఆరోపించారు. సోమవారం ఆరిలోవ, తోటగరువు రాధాకృష్ణ కల్యాణ మండపం వద్ద యాదవ సంఘం ఐక్యవేదిక నాయకులు కోడిబోయిన బాబ్జి, ఒమ్మి చిన్నారావు విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే అధిక శాతం జనాభా ఉన్న యాదవుల పట్ల అన్ని పార్టీలు చిన్నచూపు చూస్తున్నారన్నారు. విశాఖ తూర్పు అసెంబ్లీ స్థానాన్ని అక్కరమాని విజయనిర్మలకు కేటాయిస్తే అన్ని సంఘాలు కలిసి పనిచేస్తాయన్నారు.లేకుంటే స్వతంత్ర అభ్యర్ధినైనా నిలబెట్టి గెలిపించుకుంటామన్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌పై మంత్రి కానుమూరు నాగేశ్వరరావు వాఖ్యలు సిగ్గుచేటన్నారు. రాబోయే ఎన్నికల్లో యాదవ ద్రోహులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో సర్వసిద్ధి వెంకట రమణ, నక్క సావిత్రి యాదవ్‌, కోన జయలకీë, నక్క సావిత్రి, చిరంజీవి, సర్వసిద్ది అచ్చుబాబు, పారిపల్లి రాజు, కార్తీక్‌ పాల్గొన్నారు.

➡️