యుటిఎఫ్‌ కేలండర్‌ ఆవిష్కరణ

Jan 1,2024 20:48

ప్రజాశక్తి -భామిని:  స్థానిక మండల వనరుల కేంద్రంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంఇఒలు శ్రీనివాసరావు, యు.భాస్కరరావు యుటిఎఫ్‌ కేలండరు, డైరీని ఆవిష్కరించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు ఈగల తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కె.ప్రసాద్‌, కె.క్రాంతి కుమార్‌, బి.మహేష్‌, పి.తిరుపతిరావు, బాల దుర్గాప్రసాద్‌, ఎం.నాగేశ్వరరావు, బి.మురళీధర్‌, పి.లుడాతచిన్‌, కె.అప్పలనాయుడు, టి.వెంకటరమణ, టి.హేమలత, అప్పారావు, జగన్నాధ్‌, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.సీతానగరం : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని యుటిఎఫ్‌ ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీలను ఎంఇఒలు జి.సూరిదేముడు, ఎంవి రమణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, బి.ప్రసాదరావు, జిల్లా కార్యవర్గసభ్యులు ఎం.గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి. ఆదినారాయణ, ఎ.పోలినాయుడు, కె.మురళి, ఎన్‌.త్రినాధ్‌, కోశాధికారి డివి రమణ, తవిటి నాయుడు, మరియు గిరి పాల్గొన్నారు.పాఠశాల కేలండర్‌ ఆవిష్కరణ గుమ్మలక్ష్మీపురం: జియ్యమ్మవలస మండలంలోని పెదమేరంగిలో శ్రీ సత్య కైలాస్‌ పాఠశాల కేలండర్‌ను సోమవారం ప్రముఖ దర్శకులు, రచయిత, నటులు రౌతు వాసుదేవరావు మాస్టారు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కేలండర్లు దినచర్యను సూచిస్తాయని ఇవి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు దోహదపడతాయని అన్నారు. అజరు కుమార్‌ మాట్లాడుతూ కేలండర్లను బేష్‌ చేసుకుని చాలా మంది ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాలతేరు రాజశేఖర్‌ రావు వ్యవహరించగా, సమన్వయకర్తగా పాలక హరికృష్ణ వ్యవహరించారు. ఎపిటిఎఫ్‌ కేలండర్‌ ఆవిష్కరణవీరఘట్టం: స్థానిక ఎంఆర్‌సి కార్యాలయ ఆవరణలో సోమవారం మండల విద్యాశాఖ అధికారులు గౌరు నాయుడు, ఆనందరావులు 2024 సంవత్సర ఎపిటిఎష్‌ డైరీ, కేలండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్‌ మండల శాఖ నాయకులు యం. మురళి, ఆర్‌. ధనుంజయ నాయుడు, డి. శ్రీనివాసరావు, ఎం. నరహరిరావు, ఎం. అప్పలనాయుడు, ఎం. రాయినాయుడు, బియం గౌరీశ్వరరావు, శేఖర్‌, రాంబాబు, ముద్దులమ్మ, పద్మావతి, రాజేశ్వరి, రమణ నాయుడు, తిరుపతిరావు, అన్నాజీ, రాము, రాజశేఖర్‌, సురేష్‌, సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️