యువతకు మార్గదర్శి స్వామీ వివేకానంద

Jan 12,2024 22:16
ఫొటో : రెడ్‌క్రాస్‌లో స్వామీ వివేకానంద చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం

ఫొటో : రెడ్‌క్రాస్‌లో స్వామీ వివేకానంద చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం
యువతకు మార్గదర్శి స్వామీ వివేకానంద
ప్రజాశక్తి-కావలి : స్వామీ వివేకానంద చూపిన మార్గంలో యువత పయనించాలని, నిస్వార్థంగా సేవలందించడానికి ముందుకు రావాలని రెడ్‌క్రాస్‌ రక్తకేంద్రం కన్వీనర్‌ డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌ అన్నారు. స్వామీ వివేకానంద జయంతి సందర్భంగా శుక్రవారం రెడ్‌క్రాస్‌ రక్తకేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి, లెట్స్‌ యువజనోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ డి రవిప్రకాష్‌ మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవాలలో భాగంగా వారం రోజులపాటు గ్రామీణ ప్రాంతాల యువతతో అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. వారంలో 500మంది కొత్త రక్తదాతలను సమీకరిస్తామని, ప్రతిభ ఉన్న యువతను గుర్తించి సత్కరిస్తామని వివరించారు. కార్యక్రమంలో విక్రమ సింహపురి యూనివర్సిటీ పి.జి.సెంటర్‌ అధ్యాపకురాలు డాక్టర్‌ మీసాల సుశీలను ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన రక్తదాన కార్యక్రమంలో జూనియర్‌ రెడ్‌క్రాస్‌ కన్వీనర్‌ ఎ.వి.హనుమకుమార్‌ 61వ సారి, సోమనాథ్‌ 9వ సారి, బాలసాయి 7వ సారి రక్తదానం చేయగా వారిని రెడ్‌క్రాస్‌ పాలకమండలి సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ భాద్యులు దామిశెట్టి సుధీర్‌నాయుడు, గంధం ప్రసంన్నాంజనేయులు, కలికి శ్రీహరిరెడ్డి, కె హరినారపరెడ్డి, ఓరుగంటి వెంకటేశ్వర్లు, పల్లకి లోకేశ్వరరెడ్డి, పసుపులేటి సాయికుమార్‌, బిఎస్‌ ప్రసాద్‌, రెడ్‌ క్రాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️