యువత ఓటుతో అరాచకపాలనను అంతమొందించాలి

నరసరావుపేట: నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు ఏపీ వారియర్స్‌ ఆధ్వర్యంలో మై ఫస్ట్‌ ఓటు ఫర్‌ సిబిఎన్‌ అనే కార్యక్రమాన్ని నిర్వ హించారు.ఈ కార్యక్రమానికి నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పట్ట భద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్య క్రమంలో ఏపీ వారియర్స్‌ మొదటి ఓటు ప్రాధా న్యతను వివరిస్తూ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని యువకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా నరస రావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క అవకాశం అంటూ జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను దగా చేశారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా రాక్షస పాలన సాగించారని ఆరో పించారు. ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ అంటూ ఆశ చూపించి అధిక ారంలోకి వచ్చిన జగన్‌, అధికారంలోకి వచ్చాక సాక్షిలో పని చేసే జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డికి సలహా దారుడు పోస్ట్‌,వైసీపీ కార్యకర్తలకు వాలంటరీ పోస్టులు తప్ప నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వైసిపి దొంగల ముఠా ప్రతి నియోజకవర్గంలో పదివేల దొంగ ఓట్లు నమోదు చేసి గెలవడం కోసం కుట్ర రాజకీయాలు చేస్తోందని యువకులు, ఈ కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టాలన్నారు. పద్దెనిమిదేళు నిండిన యువత తమ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని, దొంగ ఓట్లను గుర్తించి వాటిని తొలగించేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ‘ఓటు’ అనే వజ్రాయుధంతో రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్నా వైసిపి పాలనను అంతం చేయాలని యువతను కోరారు. అన్ని వర్గాల సంక్షేమం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, టిడిపిని గెలిపించేందుకు మొదటి ఓటును ఉపయోగించాలని యువతను కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కె.లక్ష్మీ, పి.సునీల్‌, మీరవాలి, కె.కోటిరెడ్డి,మొహమ్మద్‌ రఫీ,ఎ.సుబ్బారావు, జి. సత్యనారాయణ, సత్య నారాయణ పాల్గొన్నారు.

➡️