రహదారులు దిగ్బంధం

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్‌ఆర్‌ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తూనే రహదారులపై బైటాయించి రాస్తారోకోలు నిర్వహించారు. అంగన్వాడీల ఆందోళనపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మైదుకూరు పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు ఫుడ్‌ కార్పొరేషన్‌చైర్మన్‌ను నిలదీశారు. క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టారు. కడపనగరంలోని ఐటి సర్కిల్‌ వద్ద మానవహారం నిర్వహించేందుకు వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిపు తోపులాట చోటు చేసుకుంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతయారం ఏర్పడింది. కొన్ని చోట్ల రాస్తారోకోను నిర్వహించకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా అంగన్వాడీలు తమ నిరసనను కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. కడప అర్బన్‌ : కడప అర్బన్‌, రూరల్‌ ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగ న్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా అర్బన్‌ ప్రాజెక్టు కార్యాలయం రాజీవ్‌ పార్క్‌ ఎదుట రాస్తారో నిర్వహించారు. అనంతరం ఐటిఐ రూరల్‌ వద్ద రాస్తారోకో నిర్వహించేందుకు బయలు దేరగా తాలూకా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నాయకులకు, కార్యకర్తలకు వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు తాలూకా పోలీస్‌ స్టేషన్‌ వద్ద బైఠాయించారు. సిఐ జోక్యం తీసుకుని నగరంలో అభివద్ధి పనుల వల్ల ట్రాఫిక్‌ తీవ్ర అంతరాయం చోటు చేసుకుంటుందని, ఇటువంటి పరిస్థితులలో రాస్తారోకో విరమించుకుని గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వాలని సూచించారు. ఇందుకు నాయకులు ససేమిరా అనడంతో చివరకు నిరసన తెలియజేసుకునే అనుమతించారు. రాస్తారోకోకు మద్దతుగా సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి పి.వెంకటసుబ్బయ్య, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు హాజరయ్యారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. లక్ష్మీదేవి, అర్బన్‌ ప్రాజెక్ట్‌ ప్రధాన కార్యదర్శి అంజనీ దేవి, రూరల్‌ ప్రాజెక్టు నుంచి యస్‌. నాగలక్ష్మి, బి. సంటేమ్మ ఎ. స్వర్ణలత, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. మైదుకూరు : పట్టణంలో రాష్ట్ర ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ చిత్తా విజరు ప్రతాప్‌రెడ్డిని అంగన్వాడీలు, ఆయాలు నిలదీశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే తమను దోషులుగా వీడియోలు చిత్రీకరించడం సబబు కాదనాన్రు. శుక్రవారం చిత్తా విజరు ప్రతాప్‌రెడ్డి కాన్వయర్‌ను వారు అడ్డుకున్నారు. దీంతో ఆయన వారి వద్దకు వచ్చి సర్దిజెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలంటూ వారు పట్టుబట్టారు. స్పందించిన చైర్మన్‌ తాను తీసిన వీడియోను మీకు ఎవరో కట్‌ చేసి పంపారంటూ సమాధానం ఇచ్చారు. త్వరలోనే పూర్తి వివరాలతో మరొక వీడియో తీసి యూట్యూబ్‌లో పెడతాను అంటూ సమాధానం ఇచ్చారు. తాను అంగన్వాడీ ఆందోళనకు సానుకూలముగా ఉన్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో వీలైనంత త్వరగా మాట్లాడి అంగన్వాడీ కార్యకర్తలకు, హెల్పర్లకు న్యాయం జరిగేలా చూస్తానంటూ హామీ ఇచ్చారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు శాంతించారు. కార్యక్రమంలో వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మైదుకూరు పట్టణంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు పిసిసి మీడియా చైర్మన్‌ తులసి రెడ్డి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వారంలోపే అంగన్వాడీల సమస్యలను పరిష్కారిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి పి శ్రీనివాసులు, సిపిఐ ఏరియా కార్యదర్శి శ్రీరాములు, సిపిఎం మండల కార్యదర్శి షరీఫ్‌, మండల సభ్యులు, జహంగీర్‌ బాష, ఎఐటియుసి నాయకులు శివ రామ్‌, సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు సభ్యులు భారతి, ధనలక్ష్మి, చెన్నమ్మ, శోభ, రజియా, వెంకటలక్ష్మి, లక్ష్మీదేవి, రమాదేవి, శివలక్ష్మి , వెంకటసుబ్బమ్మ, జ్యోతి, అనూష పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. చాపాడు మండల అంగన్వాడీ కార్యకర్తలు సుజాత, అరుణ, రామలక్ష్మి, రాధ పాల్గొన్నారు. జమ్మలమడుగు : ప్రభుత్వం దిగివచ్చి న్యాయమైన అంగన్వాడి సమస్యలు పరిష్కరించేంతవరకు అంగన్వాడీల ఉద్యమం ఆగదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్‌ అన్నారు. శుక్రవారం జమ్మలమడుగు పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న సమ్మె 11వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా జమ్మలమడుగు పట్టణంలోని పాత బస్టాండ్‌ సర్కిల్‌లో అంగన్వాడీలు అందరూ కలిసి మానవహారంగా నిలిచి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజరు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి వినరు కుమార్‌, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్‌, అంగన్వాడి యూనియన్‌ నాయకులు భాగ్యమ్మ, లక్ష్మీదేవి, నరసమ్మ, సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. వేంపల్లె : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా వారిపైనే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌, పుడ్‌ కమిటి కమిషన్‌ ఛైర్మన్‌ చింతా ప్రతాప్‌ రెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని వారు బహిరంగా క్షమాపణలు చెప్పాలని అంగన్వాడీలు డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 11వ రోజుకు చేరుకోవడంతో శుక్రవారం స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఒంటి కాలిపై నిరసన వ్యక్తం చేశారు. సమ్మెకు సిపిఐ ఏరియా కార్యదర్శి వెంకట రాములు సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి వెంకట రాము, అంగన్వాడీ సంఘాల మహిళలు సరస్వతీ, శైలజా, సావిత్రితో పాటు అంగన్వాడీలు పాల్గొన్నారు. పులివెందుల టౌన్‌ : ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ప్రారంభించి 11 రోజులు అయిన సందర్భంగా శుక్రవారం పులివెందుల తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో 11 ఆకారంలో అంగన్వాడి ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. పోరుమామిళ్ల : పట్టణంలోని తహ శీల్దార్‌ కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు ఓ. విజయమ్మ , వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ నాయకులు ఎన్‌. వీరయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపా ధ్యక్షుడు రవి కలసపాడు సెక్టార్‌ అంగన్వాడీ కార్యకర్తలు ప్రాజెక్టు లీడర్‌ మేరమ్మ, వినోదా దేవి, రామాపురం సెక్టార్‌ వి రమాదేవి, కవలకుంట సెక్టార్‌ కె విజయమ్మ, ఇటుకలపాటి సెక్టార్‌ లక్ష్మీదేవి టేకురుపేట సెక్టార్‌ దస్తగిరమ్మ, పోరుమామిళ్ల సెక్టర్‌ రమాదేవి బి జ్యోతి, సిఐటియు మండల నాయకుడు బొజ్జ చెన్నయ్య, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్‌, ఏఐటిసి మండల అధ్యక్షుడు పేరయ్య, ఆటో యూనియన్‌ నాయకుడు చంద్ర, రామయ్య, పాల్గొన్నారు. ప్రొద్దుటూరు టపుట్టపర్తి సర్కిల్‌ : పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు .ప్రభుత్వం తమపట్ల మొండిగా వ్యవహరిస్తే అంతకుమించి జగమొండిగా ఎదిరించేందుకు సిద్ధంగా ఉన్నామని అంగన్వాడీలన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సల్మాన్‌, ఓబులేసు, శేఖర్‌ ఐద్వా నాయకురాలు ముంతాజ్‌ బేగం, రాములమ్మ, వెంకటసుబ్బమ్మ, అంగన్వాడీలు నిర్మల, రాజీ, ఎఐటియుసి నాయకులు సుబ్బరాయుడు విజయ, సురేష్‌ పాల్గొన్నారు.. కడప : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్‌ హరికష్ణ, రాష్ట్ర మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు జిలాని భాష డిమాండ్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మాసాపేట శివ డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతిపక్షంలో తన పాదయాత్రలో జగన్మోహన్‌ రెడ్డి అంగన్వాడీ కార్మికులపై అపారమైన ప్రేమ వలకబోసి, అధికారంలోకి వచ్చిన తరువాత అంగన్వాడి లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారని ఘాటుగా విమర్శించారు

➡️