రాక్‌వెల్‌ పబ్లిక్‌ స్కూల్‌కు సిబిఎస్‌ఇ అనుబంధ గుర్తింపు

ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురంలోని రాక్‌వెల్‌ పబ్లిక్‌ స్కూల్‌కు అరుదైన గౌరవం లభించింది. రాక్‌వెల్‌ పబ్లిక్‌ స్కూల్‌కు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఈ) ఆఫ్లియేషన్‌ గుర్తింపును మంజూరు చేస్తూ సోమవారం న్యూఢిల్లీలోని సిబిఎస్‌ఈ కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ ప్రకాశంలో అత్యుత్తమ ప్రమాణాలతో విద్యార్థులకు కావలసిన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను అందిస్తూ ఈ ప్రాంత విద్యార్థులను ఆకట్టుకున్న ఏకైక విద్యా సంస్థ రాక్‌వెల్‌ పబ్లిక్‌ స్కూల్‌ అని చెప్పడంలో సందేహం లేదు. మార్కాపురం పట్ణణ సమీపంలోని జాతీయ రహదారి 565కు దగ్గరలో సువిశాలమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో రాక్‌వెల్‌ పబ్లిక్‌ స్కూల్‌ను నిర్మించారు. విద్యా రంగంలో రాక్‌వెల్‌ పబ్లిక్‌ స్కూల్‌ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు సంస్థల నుంచి ప్రశంసలు, ఉత్తమ అవార్డులు అందుకోవడం విశేషం. రాక్‌వెల్‌ పబ్లిక్‌ స్కూల్‌కు సిబిఎస్‌ఈ అనుబంధ గుర్తింపు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాక్‌వెల్‌ పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌ వెన్నా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రాంతం కేంద్రంగా మార్కాపురంలో అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యా ప్రమాణాలను విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో రాక్‌వెల్‌ పబ్లిక్‌ స్కూలును స్థాపించామని అన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న పోటీ ప్రపంచంలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలను అందిస్తూ, మరోవైపు క్రమ శిక్షణ, అంకిత భావంతో పాటు నైతిక విలువలతో ముందుకు వెళుతున్న క్రమంలో రాక్‌వెల్‌ పబ్లిక్‌ స్కూల్‌కు సిబిఎస్‌ఈ అనుబంధ గుర్తింపునిస్తూ ఉత్తర్వులు రావడం తమకు, స్కూల్‌ సిబ్బందికి ఆనందంగా ఉందని అన్నారు.

➡️