రాఘవులు స్థూపానికి నివాళులర్పిస్తున్న ఐవి

కాటిబోయిన రాఘవులు

కాటిబోయిన ఆశయసాధనకు కృషి

ప్రజాశక్తి -ఎటపాక : మన్యంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కాటిబోయిన రాఘవులు కృషి ఎనలేనిదని, ఆయన ఆశయాల సాధనకు అందరూ పాటుపడాలని సిపిఎం మండల కార్యదర్శి ఐవి పిలుపునిచ్చారు. ఆదివారం చింతలగూడెం గ్రామంలో కాటిబోయిన రాఘవులు 12 వర్ధంతిని నిర్వహించారు. కాటిబోయిన స్ఫూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐవి మాట్లాడుతూ, ధరలు, పన్నుల భారం, కనీస సౌకర్యాల లేమి, నిరుద్యోగం, పంటనష్టాలు, వేతనాలు అందక కార్మికులు, ఉద్యోగుల అవస్థలు ఇలా సవాలక్ష సమస్యలతో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వాలు, పాలకులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో కాటిబోయిన రాఘవులు వంటి మహానీయుల స్ఫూర్తితో సమస్యల పరిష్కారానికి సమిష్టిపోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆకిశెట్టి రాము, ఐ.పద్మ పాల్గొన్నారు.

➡️