రాజంపేటలో సినీనటి అనసూయ సందడి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ చెన్నై వారి ఎంజిఆర్‌ నూతన వస్త్రాలయ ప్రారంభోత్సవం గురువారం పాత బస్టాండ్‌ సమీపంలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీనటి అనసూయతో పాటు స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి, జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులురెడ్డి, టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్‌ మోహన్‌రాజు, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు పాల్గొని వస్త్రాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనసూయ మాట్లాడుతూ ఎంజిఆర్‌ వస్త్రాలయం దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు నేడు రాజంపేటకు రావడం ఈ ప్రాంత ప్రజలకు సదవకాశమని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో పాటు నాణ్యమైన వస్త్రాలు అందించడం ఎంజిఆర్‌ ప్రత్యేకతన్నారు. పండుగలు, వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక ఆఫర్లతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటాయని వివరించారు. అనసూయను చూసేందుకు రాజంపేట వాసులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు.

➡️