రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలు పరచాలి

Jan 26,2024 21:56
ఫొటో : నినాదాలు చేస్తున్న దళిత నాయకులు

ఫొటో : నినాదాలు చేస్తున్న దళిత నాయకులు
రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలు పరచాలి
ప్రజాశక్తి-కావలి : రాష్ట్రంలో జగనన్న రాజ్యాంగం అమలు పరచడం ఇప్పటికైనా ఆపి, అంబేద్కర్‌ రాజ్యాంగం అమలు పరచాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి మాట్లాడుతూ రిపబ్లిక్‌ డే సందర్భంగా 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినోత్సవం అని తెలిపారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం అమలుపరచకుండా వ్యక్తిగతంగా జగనన్న రాజ్యాంగం అమలు పరుచుతున్నారని అధికారులు బడుగు బలహీన వర్గాలను అణచివేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం 342 అర్టికల్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా ఎస్‌సి కార్పొరేషన్‌కు రావాల్సిన డబ్బులు 4సంవత్సరాల పదినెలల్లో 43వేల కోట్ల రూపాయిలు దళిత గిరిజనుల సంక్షేమానికి ఖర్చుపెట్టకుండా జగనన్న వ్యక్తిగత రాజ్యాంగం రాసుకొని అధికారుల ద్వారా సంక్షేమ పథకాల నిధులు అన్ని కూడా అమ్మఒడికి వేశారని తెలిపారు. 1971లో ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్‌సి ఎస్‌టి కార్పొరేషన్‌లు నెలకొల్పి తద్వారా దళిత గిరిజనులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దళిత గిరిజనులకు ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. తద్వారా గ్రామాలల్లో దళిత గిరిజనులు ఆర్ధికంగా చితికిపోయారని తెలిపారు. రెండురోజుల క్రితం అల్లూరు మండలంలోని బట్రకాగొల్లులో యానాదులపై దాడిచేసి గాయపరిచిన వారిని వైఎస్‌ఆర్‌సిపి నియోజకవర్గ స్థాయి నాయకుడు ఫోన్‌ చేయడం వల్ల జగనన్న రాజ్యాంగం అమలు చేస్తున్నారని తెలిపారు. దళితులను హత్య చేసి డోర్‌డెలివరీ ఇచ్చిన వారిని ఊరేగిస్తున్నారని తెలిపారు. జగనన్న అంబేద్కర్‌కు నమస్కారం పెట్టే అర్హత లేదన్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారన్నారు. బడుగు వర్గాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని యాప్‌ల ద్వారా చిత్రహింసలు గ్రామాలలో పడుతున్నారని తెలిపారు. దళిత గిరిజనులకు 1బి ఇవ్వవద్దని తహశీల్దార్‌లకు ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమైన విషయమన్నారు. తిప్పలో జరిగే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి ఎంఎల్‌ఎ సహకారం అందిస్తున్నారన్నారు. దళిత గిరిజన భూముల్లో గ్రావెల్‌ ఎత్తి భూములను సర్వానాశనం చేస్తున్నారని తెలిపారు. ఇదే జగనన్న రాజ్యాంగం అన్నారు. బడుగు వర్గాలు అందరు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పి అంబేద్కర్‌ రాజ్యాంగం కోసం ఉద్యమించాలని తెలిపారు. కార్యక్రమంలో యానాది సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బాపట్ల సత్యవతమ్మ, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు జరుగుమల్లి విజయరత్నం, చౌటూరి లక్ష్మయ్య, ఆలూరి బ్రహ్మయ్య, ఏ కిరణ్‌కుమార్‌, ఇంకా దాదాపు 100మంది పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించారు.

➡️