రాష్ట్రవ్యాప్తంగా, జరుగుతున్నప్రభకు వినతిపత్రం అందిసున్న మామిడికుదురు అంగన్‌ వాడీలు

వినతిపత్రాలు సమర్పిస్తూ.. పిండి వంటలు పెడుతూ..

ప్రజాశక్తి-యంత్రాంగం

డిమాండ్ల సాధన కోసం గత 36 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్‌వాడీల కొనసాగుతోంది. మంగళవారం జిల్లాలో అంగన్‌వాడీలు పలు విధాలుగా నిరసన తెలిపారు. మామిడికుదురు మామిడికుదురు లో అంగన్‌ వాడీల చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఎస్మా జిఒ ఉప సం హరించుకోవాలని, డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని కోరుతూ ‘ప్రభ’కు వినతిపత్రం అందించారు. ముమ్మిడివరం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న దిగిరాని ప్రభుత్వ తీరును నిరసిస్తూ పండగ పూట శిబిరంలోనే పిండి వంటలు వండి ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి బొత్స మరియు సలహాదారు సజ్జల చిత్రపటాలకు పెట్టి అంగన్‌ వాడీలు నిరసన తెలిపారు. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అధ్యక్ష, కార్యదర్శులు జయలక్ష్మి, దుర్గా మల్లేశ్వరి ల ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. అంగన్‌ వాడీలు కారంతో బోజనాలు చేశారు.ఈ సందర్బంగా ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ 36 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం దిగి రాకపోవడంతో పిండి వంటలు చేసి ముఖ్యమంత్రి, మంత్రి మరియు సలహా దారు ఫోటోల ముందు పిండి వంటలు పెట్టీ మీకు తీపి బోజనాలు మాకు కారం బోజనాలే గతి అంటూ వినూత్న రీతిలో నిరసన నినాదాలు చేశారు. కనీస వేతనం రూ.26 వేలు,సమాన పనికి సమన వేతనం, గ్రాట్యుటీ అమలు తో పాటు ఉద్యోగ భద్రత వంటి హామీలు సాధించే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.ఈ నిరసనలో సెక్టార్‌ లీడర్‌ ధనలక్ష్మి,్మ జి.శ్రీదేవి, జి.మంగాయమ్మ, వి.తలుపులమ్మ, ఎన్‌.విజయ కుమారి, కె సత్యవతి, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.మండపేట స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెలో భాగంగా శిబిరం వద్ద కనుమ పండుగను జరుపుకున్నారు. కనుమ రోజున ఆకలి కడుపుతో అంగన్‌వాడీలకు కన్నీళ్లు అంటూ నినాదాలు చేశారు. హరిదాసు వేషం వేసిన అంగన్‌వాడకి బియ్యం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కృష్ణవేణి మాట్లాడుతూ గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ నాయకులు ఆహార దీక్షలు చేస్తారన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. సమస్యలు పరిష్కారమయేంతవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండపేట ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

 

 

➡️