రాష్ట్రాభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలి

Feb 23,2024 21:26

ప్రజాశక్తి- మెంటాడ : రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలని టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం రాబంద గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ అరాచక పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ఉద్యోగాలు ఇస్తామని మోసపూరితమైన మాటలు చెప్పి యువతను నిరుద్యోగులుగా చేసిన ఘనత వైయస్‌ జగన్‌కే దక్కుతుందని ఆమె దుయ్యబట్టారు. అనంతరం పట్టని సన్యాసిరావు తోపాటు వైసిపి నుంచి15 కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు, సీనియర్‌ నేతలు గెద్ధ అన్నవరం, రెడ్డి ఆదినారాయణ, గొర్లె ముసలినాయుడు, రెడ్డి ఎర్రన్నాయుడు, ఎస్‌ గురు నాయుడు తదితరులు పాల్గొన్నారు.టిడిపిలో పలువురు చేరికవంగర: మండలంలోని కింజంగి ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన బెజ్జిపురం నూకంనాయుడు, బురిడీ సింహాలునాయుడు, బెజ్జిపురం అప్పలనాయుడు, వావిలపల్లి ఆదినారాయణతో పాటు మరికొంతమంది వైసిపిని వీడి టిడిపి నాయకులు బెజ్జిపురం ముకుంద నాయుడు ఆధ్వర్యంలో టిడిపిలో శుక్రవారం చేరారు. వీరందరికీ మాజీమంత్రి, రాజాం నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి కొండ్రు మురళీమోహన్‌ శ్యాంపురం గెస్ట్‌ హౌస్‌ వద్ద టిడిపి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బొచ్చ వాసుదేవరావు నాయుడు, పిన్నింటి మోహనరావు, మజ్జి గణపతి, బెజ్జిపురం రవి, పాడి రాంబాబు, చీమల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️