రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకుందాం

Jan 25,2024 20:21

ప్రజాశక్తి-విజయనగరం కోట  : రాష్ట్ర భవిష్యత్తు ను కాపాడుకుందామని విజయనగరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ అదితి విజయలక్ష్మి గజపతిరాజు ప్రజలను కోరారు.గురువారం బాబు షఉ్యరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం పట్టణం 16వ , 12వ డివిజన్‌ లలో నియోజకవర్గ ఇంచార్జ్‌ పూసపాటి అదితి గజపతి రాజు ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు, రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం – జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, రాష్ట్ర బీసీ నాయకులు వేచలపు శ్రీనివాసరావు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు , నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీ 12,16వ డివిజన్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️