రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పరిశీలన

ప్రజాశక్తి-కొత్తపట్నం : జగనన్న లేఅవుట్‌లో లబ్ధిదారులకు ఇచ్చిన ఇంటి నివేశ స్థలాల పట్టాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను జాయింట్‌ కలెక్టర్‌ గోపాల్‌ కష్ణ మంగళ వారం పరిశీలించారు. అల్లూరు రెవెన్యూ పరిధిలోని అల్లూరు, కొత్తపట్నం సచివాలయాల్లో చేపట్టిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించారు. అల్లూరు సచివాలయం-12 పరిధిలో మొత్తం 308 మంది లబ్ధిదారులకు 128 మందికి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. కొత్తపట్నం సచివాలయం పరిధిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సాంకేతిక కారణాల వీలు కాలేదు. దీంతో జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకష్ణ విజయవాడ సెక్రటేరియట్‌కు ఫోన్‌ చేసి సత్వరమే సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు ఎస్‌ సురేష్‌ , ఉప తహశీల్దారు అర్జున్‌ రెడ్డి, ఇఒఆర్‌డి బాల చెన్నయ్య, అల్లూరు, కొత్తపట్నం కార్యదర్శులు రామారావు, అల్లయ్య, ఎఎస్‌ఒ కోటేశ్వరరావు, విఆర్‌ఒలు సురేష్‌, వినోద్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️