రీసర్వేలో తప్పులుంటే ఫిర్యాదు చేయండి

Feb 9,2024 20:01

ప్రజాశక్తి-బొబ్బిలి  : రీసర్వేలో తప్పులుంటే ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేసి సరి చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ అన్నారు. బుడా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మూడో విడత రీసర్వే జరుగుతుందన్నారు. సర్వే రాళ్లను పాతి పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎంఐజి లేఅవుట్‌కు సాలూరు మున్సిపాలిటీలో భూసేకరణ పూర్తయిందన్నారు. బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలో భూసేకరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో అర్హత ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయనతో ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌ ఉన్నారు.వీణల కేంద్రాన్ని సందర్శించిన జెసిగొల్లపల్లిలోని బొబ్బిలి వీణల కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ సందర్శించారు. వీణల తయారీపై కళాకారులను అడిగి తెలుసుకున్నారు. వీణల అమ్మకాలు, కళాకారుల జీవన స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు. వీణల తయారీకి అవసరమయ్యే కలపను ప్రభుత్వం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని వారు జెసిని కోరారు. కలప అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కలప సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని జెసి హామీ ఇచ్చారు.

➡️