రూ.367.08 కోట్లు రైతుల ఖాతాల్లో జమ

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌

జిల్లాలో ధాన్యం విక్రయించిన 34,041 మంది రైతులకు రూ.367.08 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని జెసి లావణ్య వేణి తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సోమవారం జెసి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 5.66 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రాథమికంగా అంచనా వేసామన్నారు. జిల్లాలోని 251 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి 21 రోజుల వ్యవధిలో ధాన్యం డబ్బు ఖాతాల్లో వేస్తున్నామన్నారు.

➡️