రైతులకు నష్టపరిహారం అందించాలి

Dec 13,2023 00:10
ఎలుబండి రాజారావు,

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి

తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. నష్టం అంచనాల పరిశీలనకు టిడిపి రాష్ట్ర కమిటీ నియమించిన కమిటీలోని సభ్యులు చిక్కాల రామచంద్రరావు, వనమాడి కొండబాబు, రమణ బాబు, బోళ్ళ వెంకటరమణ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వర్మ నేతృత్వంలో బృందంగా రమణక్కపేట, ఇతర గ్రామాల్లో మంగళవారం పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజక వర్గంలో పంట నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వైసిపి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమని, ఇక్కడ గండ్లు పడిపోయి పంటలు పూర్తిగా ద్వం సం అయ్యాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా లేదని, ఎక్కడా కూడా గోనె సంచులను సైతం రైతులకు ఇవ్వడం లేదన్నారు. తేమ శాతం ఎక్కువ ఉందని మిల్లర్స్‌ ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్నారు. పంట పొలాలు మునిగి పోయాయని అన్నారు. పిఠాపురం నియోజక వర్గంలో చేబ్రోలు, తాటిపర్తి, చెందుర్తి, జగ్గంపేట వన్నెపూడి, కొడవలి, దొంతమూరు ఇతర గ్రామా ల్లో పత్తి, మిరప చేలు, దొండ, కాకర పాదులు పూర్తిగా ధ్వంసం అయ్యాయని అన్నారు. మెరక పంటకు ఎకరానికి రూ.50 వేలు, వరికి రూ.30 వేలు చొప్పున పంట నష్టపరిహారం తక్షణమే ప్రభు త్వం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులు శ్రేయ స్సు కోసం ఏలేరు ఫేస్‌ 2 ఆధునీకరణ కోసం సుమారుగా రూ.168 కోట్లను తమ ప్రభుత్వం కేటాయించిందని, శంకుస్థాపన చేసి టెండర్‌ అయ్యి పనులు మొదలు పెట్టిన దానిని జగన్‌ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానంద రెడ్డి, కృష్ణా రెడ్డి, సకుమళ్ళ గంగాధర్‌, ఎలుబండి రాజారావు, ఆడగార్ల శివ, ఎంపిటిసి నాగేంద్ర, పార్టీ ప్రెసిడెంట్‌ శ్రీనువాస్‌ రెడ్డి, కూత సూరిబాబు, అడ్డగార్ల శివ, మాజీ ఎంపిటిసి చిట్టిబాబు పాల్గొన్నారు.

➡️