రైతులకు విత్తనాల పంపిణీ

Dec 15,2023 22:30 #formers
ఫొటో : విత్తనాలను పంపిణీ చేస్తున్న ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి

ఫొటో : విత్తనాలను పంపిణీ చేస్తున్న ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
రైతులకు విత్తనాల పంపిణీ
ప్రజాశక్తి వరికుంటపాడు : ఇటీవల జిల్లాలో బీభత్సం సృష్టించిన మిచాంగ్‌ తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన బాధిత శెనగ రైతులకు ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి అందజేశారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని విరువూరు గ్రామ పంచాయతీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తుపాను ప్రభావంతో గ్రామంలో శెనగ రైతులు నష్టపోయారన్నారు. ఈ మేరకు వ్యవసాయ అధికారి ఉన్నతాధికారులు నివేదికను పంపక ప్రభుత్వం వారు శెనగలను మంజూరు చేశారని తెలిపారు. అనంతరం ప్రతి ఇంటి గడపకు తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వైసిపి ప్రభుత్వంలో లబ్ధి పొందిన వివరాలను కూడా వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమపథకాలు అందజేస్తుందన్నారు. ఈ పథకాలు అందాలంటే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. జరగబోయే ఎన్నికలలో ప్రతిఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేస్తే జగన్నే ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎఎంసి చైర్మన్‌ అలీ అహ్మద్‌, మండల కన్వీనర్‌ మందలపు తిరుపతి నాయుడు, సొసైటీ చైర్మన్‌ గుంటుపల్లి రామాంజనేయులు, జిల్లా కోఆప్షన్‌ సభ్యులు మాగంటి శ్రీనివాసులు, సచివాలయ కన్వీనర్‌ పాలకొల్లు తిరుపతరెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

➡️