రైతులను ఆదుకుంటాం:ఎమ్మెల్యే

ప్రజాశక్తి- కొత్తవలస:  మండలంలో చిన్నిపాలెం, పంచాయతీ పరిధిలో మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా పంట నష్టం జరిగిన ప్రాంతాలలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గురువారం పర్యటించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ దశలో ఉన్న నేషనల్‌ హైవే కోసం దగ్గరలో వున్న చెరువు గట్టును సగం తొలగించివేయడంతో తుపాను సమయంలో ఆ చెరువు కింద ఉన్న పొలాలు మొత్తం సుమారు 25 ఎకరాలు నీట మునిగిపోయాయని రైతులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తడిచిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్నారు. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకూడదని వ్యవసాయాధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నీలం శెట్టి గోపమ్మ, వేపాడ ఎంపిపి దొగ్గ సత్యవంతుడు, వైసిపి మండల అధ్యక్షులు ఒబ్బిన నాయుడు, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ, వైస్‌ ఎంపిపి కర్రి శ్రీను, ఉత్తరాపల్లి ఎంపిటిసి శివప్రసాద్‌, వీరభద్రపురం, గేదెల మూర్తి, బీస్మ, పవన్‌, వెంకటరావు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందిశృంగవరపుకోట : తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పంట నష్టాలపై గురువారం నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిచౌంగ్‌ తుపాను కారణంగా నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయని ఈ నేపథ్యంలో ధాన్యాన్ని ఎండబెట్టిన తర్వాత అవి ఎలా ఉన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతుకు పంట నష్టాన్ని తగ్గించాల సూచించారు. అందుకు మండలాల వారీగా పంట నష్టానికి సంబంధించి జాబితాను తీసుకొని వ్యవసాయ శాఖ మంత్రిని సంప్రదించి రైతుకు పూర్తి ధర వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. వ్యవసాయ శాఖ ఎడి విజయ మాట్లాడుతూ నియోజకవర్గంలో 42,269 ఎకరాల్లో వరి పంట వేయగా అందులో 1700 ఎకరాలు వరి పంట వర్షాభావ పరిస్థితి వల్ల ఎండిపోగా తుపాను దాటికి 6120 ఎకరాల్లో వరికుప్పలు నీట మునిగాయని అన్నారు. ఈ సమావేశంలో డిసిసిబి చైర్మన్‌ వేచలపు చిన్నరామనాయుడు, ఎఎంసి చైర్‌పర్సన్‌ మూకల కస్తూరి, నియోజకవర్గంలోని ఐదు మండలాల జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, వ్యవసాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పంటలను పరిశీలించిన ఎంపిపిమండలంలో మిచౌంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాలలో దెబ్బతిన్న పంటలను ఎంపిపి సండి సోమేశ్వరరావు గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి ఇందుకురి సుధారాజు, రేవల్లపాలెం సర్పంచ్‌ జాగరపు కృష్ణమ్మ, ఎస్‌.కోట సర్పంచ్‌ జి.సంతోషికుమారి, నాయకులు రామకృష్ణ, జాగరపు చెల్లంనాయుడు, రాయవరపు వెంకటరావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, రైతులు పాల్గొన్నారు.

➡️