రైతుల సమస్యలను పరిష్కరించాలి

Jan 5,2024 21:47
ఫొటో : తహశీల్దారుతో మాట్లాడుతున్న వైసిపి నేతలు

ఫొటో : తహశీల్దారుతో మాట్లాడుతున్న వైసిపి నేతలు
రైతుల సమస్యలను పరిష్కరించాలి
ప్రజాశక్తి-సీతారామపురం : మండలంలోని ప్రతీ రైతు సమస్యను తొందరగా పరిష్కరించాలని తహశీల్దార్‌ సుధాకర్‌ బాబును మాజీ జెడ్‌పిటిసి దుగ్గిరెడ్డి గురవారెడ్డి, రాష్ట్ర బిసి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పిసి అల్లూరు రాజు కోరారు. శుక్రవారం సింగారెడ్డిపల్లెలోని సచివాలయంలో పలు రైతులతో కలిసి తహశీల్దారును కలిశారు. ఈ సందర్భంగా మండలంలో అనేక భూ సమస్యలతో రైతులు పంటలు వేసుకోక సతమతమవుతున్నారని వారి సమస్యలను తొందరగా పరిష్కరించాలన్నారు. అంతేకాకుండా పొలాలకు మీటర్లను బిగించుకునేందుకు రెవెన్యూ కార్యాలయం ద్వారా వచ్చే అనుమతులను తొందరగా రైతులకు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు తిరుపాలు, మాజీ సర్పంచ్‌ పానెం చంద్రమౌళి, గండిపాలెం మాజీ ఎంపిటిసి పాముల రమణయ్య, జిల్లా వైసిపి యూత్‌ జాయింట్‌ సెక్రెటరీ ముద్దుకృష్ణమరాజు, సీనియర్‌ వైసిపి నాయకులు తిరుపతయ్య, అబ్బిరెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

➡️