రైతు, కార్మిక సంఘాల నిరసన

Mar 14,2024 22:02

 ప్రజాశక్తి-బొబ్బిలి : దేశంలో బిజెపి అమలు చేస్తున్న రైతు,కార్మిక వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం జిల్లాలోపలుచోట్ల నిరసన తెలిపారు. ఢిల్లీలో రైతుల బహిరంగ సభకు మద్దతుగా ర్యాలీలు చేశారు.బొబ్బిలిలో రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు .కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌.గోపాలం, పట్టణ కళాసీ సంఘం కార్యదర్శి డి.వర్మ, ఎఐటియుసి నాయకులు ఎం.శ్రీనివాస్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మునాయుడు, ఇఫ్టూ నాయకులు వి.రామ్మూర్తి డిమాండ్‌ చేశారు. ప్రజా సంఘాల నాయకులు పి.లక్ష్మణరావు, సురేష్‌, మణికుమార్‌, వి.శేషగిరిరావు, రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

విజయనగరంటౌన్‌ : అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కోట జంక్షన్‌ ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి సింహాచలం మేడ వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్‌రావు మాట్లాడారు.కార్యక్రమంలో సిఐటియు నగరకార్యదర్శి రమణ, నాయకులు త్రినాథ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.రాము, సిహెచ్‌ వెంకటేష్‌, నాయకులు సౌమ్య, రవి, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు హరీష్‌, సతీష్‌ పాల్గొన్నారు.

గజపతినగరం : రైతు సంఘాల కిసాన్‌మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన చినచామలాపల్లిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడారు. రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని మోడీ రైతులను మోసం చేశారన్నారు. స్వామినాథన్‌ చెప్పినట్లు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుకు వెనక్కి తీసుకోవాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లు, 4 లేబర్‌ కోడ్‌ల రద్దుకు రైతులు,కార్మికులు చేస్తున్న పోరాటాలను బలపరచాలని విజ్ఞప్తి చేశారు. కోసం ప్రజానీకం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్‌, చిన చామలాపల్లి గ్రామ రైతులు, కూలీలు, వత్తిదారులు పాల్గొన్నారు.

కొత్తవలస : ఢిల్లీలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గాడి అప్పారావు మాట్లాడారు. కార్యక్రమంలో ముఠా కార్మికులు, ఆటో కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

గరివిడి: అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిటికి వినతి పత్రాన్ని అందజేశారు. సిఐటియు మండల డివిజన్‌ కార్యదర్శి అంబాల్ల గౌరి నాయుడు, గంటేడ అప్పలరాజు, వి. ప్రకాష్‌, తాళ్లపూడి సాంబశివ, పిసిని చిన్నప్పల్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

రేగిడి : ఉణుకూరు , అంబాడ వెంకటాపురంలో రైతు సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఉణుకూరులో రాస్తా రోకో చేశారు. సిఐటియు, రైతు సంఘం నాయకులు వంజరాపు తిరుపతి, పోరెడ్డి విశ్వనాధం, దుబా కమల్నాయుడు, ఎం. అసిరినాయుడు, కడగళ్ల గురునాయుడు, బలరాం నాయుడు, తదితరు పాల్గొన్నారు.

భోగాపురం : కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పూసపాటిరేగ, భోగాపురంలో సిఐటియు నాయకులు బి. సూర్యనారాయణ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. రమణ,అప్పారావు, దాసు, రవి, రామసూరి తదితరురలు పాల్గొన్నారు.

➡️