రోటరీ గోల్డ్‌ అధ్యక్షునిగా గోపీనాధ్

రోటరీ గోల్డ్‌

ప్రజాశక్తి-కాకినాడరోటరీ గోల్డెన్‌ జూబ్లీ క్లబ్‌ 2025-26 సంవత్సరానికి నూతన అధ్యక్షునిగా వంశీ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ గోపీనాథ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు క్లబ్‌ అధ్యక్షులు నరహరిశెట్టి రవికృష్ణ ప్రకటించారు. రోటరీ గోల్డెన్‌ జూబ్లీ క్లబ్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో అధ్యక్షునిగా ఎన్నికైన గోపీనాథ్‌కు ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ ఎస్‌.శ్రీకాంత్‌ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్‌ గోపి మాట్లాడుతూ రోటరీ డిస్ట్రిక్ట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన గోల్డెన్‌ జూబ్లి క్లబ్‌కు అధ్యక్షులుగా ఎంపిక చేసిన క్లబ్‌ కార్యవర్గంతో పాటు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. క్లబ్‌ ప్రతిష్టను మరింతగా పెంపొందించేందుకు సభ్యులందరి భాగస్వామ్యంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చందు, కోశాధికారి పవన్‌, అసిస్టెంట్‌ గవర్నర్‌ ఉదయభాను, సత్తి రవి రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

➡️