రోడ్డుపై మట్టి కుప్పలు తొలగించాలి

ప్రజాశక్తి-సిఎస్‌ పురం: సిఎస్‌ పురం గ్రామంలో తాగునీటి కోసం ఇటీవల కులాయి పైపులైన్లు వేయటం కోసం రోడ్లకు ఇరు వైపులా కాలువలు తీసి మట్టి కుప్పలు వేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు సిపిఎం నాయకులు ఊసా వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కాలువలకు మట్టి పూడ్చే క్రమంలో కొంత మట్టిని రోడ్లపైనే వదిలి వేయడం వల్ల పాదచారులు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రోడ్లపై ఉన్న మట్టిని పూర్తిగా తొలగించాలని ఊసా వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆయన కోరారు.

➡️