రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

Dec 28,2023 21:13

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  నగరంలోని రామారాయుడు రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి గురువారం శంకుస్థాపన చేశారు. బుద్ధుడి విగ్రహం నుండి ఎస్‌బిఐ మెయిన్‌ బ్రాంచ్‌ వరకు ఉన్న రహదారిని నూతనంగా నిర్మించనున్నారు. కోటి 70 లక్షల నిధులతో రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు కాపుగంటి ప్రకాష్‌, మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, కమిషనర్‌ ఆర్‌.శ్రీరాములు నాయుడు, వైసిపి నగర అధ్యక్షులు ఆశపు వేణు,గవర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

➡️