రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : ఎంవిఐ

ప్రజాశక్తి-పీలేరు వాహనాలు నడిపే సమయంలో మెళకువలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ కుమారి, సిఐ మోహన్‌రెడ్డి తెలిపారు. 35వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం స్థానిక ఆర్‌టిఒ కార్యాలయంలో ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో స్థానిక లయన్స్‌ క్లబ్‌ వారు వాహనదారులకు కంటి పరీక్షా శిబి రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు కానీ, రవాణా శాఖ వారు కానీ వాహన చోధకుల మేలుకోరి నియమ నిబం ధనలు పాటించేట్టు సూచిస్తారన్నారు. యువత నిబంధనలను పాటించాలని కోరారు. లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు మాట్లాడుతూ పీలేరు పరిసర ప్రాంతాల్లో అనేక రకాల సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, భద్రత మాసోత్సవాల సందర్భంగా కంటి పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సభ్యు లైన షి సంస్థ అధ్యక్షులు డాక్టర్‌ పివిఎస్‌ లక్ష్మి మాట్లాడుతూ వాహన దారులు మనసును ఆందోళన వైపు మళ్ళించకుండా జాగ్రత్తగా నడపాలని తెలి పారు. షి సంస్థ న్యాయ సలహాదారు డాక్టర్‌ రాయల సుధాకర్‌ మాట్లాడుతూ వేగం కన్నా ప్రాణం విలువైనదన్నారు. పీలేరు ఆర్టీసీ డిపో మేనేజర్‌ బండ్ల కుమార్‌ మాట్లాడుతూ ఆటోల్లో పరిమితికి మించి ప్రయా ణికులను ఎక్కిస్తూ ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. బి.ఆనంద్‌రెడ్డి, హేమంత్‌రెడ్డి వాహనదారులకు కంటి పరీక్షలు నిర్వ హిం చారు. కార్యక్రమంలో పీలేరు లయన్స్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు సురేం దర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, కోశాధికారి జయచంద్రనాయుడు పాల్గొన్నారు. వాల్మీకిపురం: ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని పులిశేఖర్‌ అన్నారు. స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో వాహనదారులు, డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనల మేరకు వాహనాలు నడపాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఆటోలో ప్రయాణిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కారులో ప్రయాణించే వారు సీటుబెల్టు, ద్విచక్రవాహనదారుడు హెల్మెట్‌ ధరించాలని సూచించారు. అనంతరం వాహనాలను తనిఖీ చేసి, జరిమానా విధించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు నాగేశ్వరరావు, కృష్ణమూర్తి, సిబ్బంది రిజ్వాన్‌ పాల్గొన్నారు.

➡️