రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

ఐటిడిఎ పిఒ చైతన్యకు వినతిపత్రం ఇస్తున్న ఎంపిపి లక్ష్మి, ప్రజాప్రతినిధులు, సిపిఎం నేతలు

ఐటిడిఎ పిఒకు సిపిఎం నేతలు, ప్రజా ప్రతినిధుల వినతి

ప్రజాశక్తి-విఆర్‌.పురం

మండలంలో గతేడాది ఏడాది భారీ వర్షాలు, వరదలు కారణంగా మండల వ్యాప్తంగా రోడ్లు అధ్వానంగా మారాయని, ఏ గ్రామంలో చూసినా, గోతులు దర్శనమిస్తున్నాయని, తక్షణమే రోడ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని సిపిఎం నాయకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు చింతూరు ఐటిడిఏ పిఓ కావూరి చైతన్యకు వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని శనివారం విఆర్‌ పురం ఎంపిపి కారం లక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు ఆధ్వర్యాన వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలోని నెలకొని ఉన్న పలు సమస్యలను పిఓకు వివరించారు. మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్న శ్రీరామగిరి గ్రామంలో మంచి నీటి సమస్య ఉందని, నిరంతరాయంగా మంచినీరు సరపరా చేయాలని కోరారు. పైసమస్యలు పరిష్కారానికి పిఓ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో విఆర్‌.పురం మండలంలోని సిపిఎం సర్పంచ్‌లు పూనెం సరోజిని, వెట్టి లక్ష్మి, పులి సంతోష్‌ కుమార్‌, సవలం మారయ్య, కారం బుచ్చమ్మ, సిపిఎం నాయకులు గుండెపూడి లక్ష్మణరావు, వడ్లాది రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️