‘రోశయ్య’ అజాత శత్రువు : ఎమ్మెల్యే

ప్రజాశక్తి-మార్కాపురం : దివంగ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య రాజకీయాల్లో అజాత శత్రువు అని మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి కొనియాడారు. రోశయ్య వర్ధంతి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రిగా రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించారన్నారు. తొలుత రోశయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచెర్ల బాలమురళీకృష్ణ, కౌన్సిలర్లు బుశ్శెట్టి నాగేశ్వరరావు, కశ్శెట్టి నగేష్‌కుమార్‌, చాటకొండ చంద్రశేఖర్‌, కొత్త వీరవెంకటకృష్ణ, డి.కరిముల్లా, జడ్‌పిటిసి నారు బాపన్‌రెడ్డి, వైసిపి నాయకులు పోరెడ్డి చెంచిరెడ్డి, బొగ్గరపు శేషగిరిరావు, బూదాల సతీష్‌, ఎం. ఉత్తమ్‌కుమార్‌ పాల్గొన్నారు. చీమకుర్తి : దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ద్వితీయ వర్ధంతి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు చలువాది బదరీ నారాయణ, జెవివి జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ బి.జవహర్‌, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నూనె హేమసుందరరావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు నూనె అనుదీప్‌, నూనె వంశీ, ఆలపాటి నరసింహా రావు, చలువాది రమేష్‌, నూకల సుబ్రహ్మణ్యం, మద్ది వెంకటేశ్వర్లు, ఆలపాటి శ్రీను, కొణిజేటి శ్రీను, అద్దే శ్రీను, వెల్లంపల్లి రంగారావు, దుడ్డు రంగనాయకులు, కొలిపర్తి సుందరం పాల్గొన్నారు. యర్రగొండపాలెం : దివంగత ముఖ్యమంత్రి రోశయ్య వర్ధంతి ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం మాజీ డైరెక్టర్‌ ఐవి. సుబ్బారావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు సత్యనారాయణ, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, చిన్నమస్తాన్‌రావు, ఇమ్మడిశెట్టి కృష్టయ్య, సూరె వెంకట రమేష్‌, కుందూరు ఆదినారాయణ, సంతోష్‌ కుమార్‌, కందూరి గురు, అడుసుమల్లి రామచంద్రారావు పాల్గొన్నారు.

➡️