లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ

ప్రజాశక్తి-టంగుటూరు : కొండపి నియోజకవర్గంలో గ్రూపు విభేదాలున్నాయని.. 1వ కష్ణుడు.. 2వ కష్ణుడు.. 3వ కష్ణుడు.. వస్తున్నారు.. పోతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినోడు కష్ణుడు కాదు. ఏకలవ్యుడు.. జగనన్న పంపిన ఏకలవ్యుడు అంటూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి, కొండపి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి ఆదిమూలపు సురేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు సోమవారం పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలంలో 9,690 మంది పెన్షన్‌ లబ్ధిదారులు ఉండగా.. వారికి ప్రతినెల రూ 3 కోట్లకు పైగా పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలోని అవ్వ, తాత్ణలకు సైతం ప్రతి నెలా 1వ తేదీనే నిద్రలేపి వాలంటీర్లు పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలతోనే పొత్తు..! ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు ప్రవేశపెట్టే మ్యానిఫెస్టో అంటే అదేదో హామీ పత్రం కాదని సురేష్‌ పేర్కొన్నారు. అదే మేనిఫెస్టోను బైబిల్‌, భగవద్గీత, ఖురాన్‌ గా ముఖ్యమంత్రి జగన్‌ భావించారని తెలిపారు. అందులో భాగంగా కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు అనేక పథకాల ద్వారా నేరుగా వారికి డబ్బులు అందజేసినట్లు తెలిపారు. గ్రామీణ పాఠశాలల రూపు రేఖలను మార్చి ఉన్నత విద్యను విద్యార్థులకు అందిస్తున్నారన్నారు. ఎవరు ఎన్ని రకాల పొత్తులు పెట్టుకున్నా జగన్మోహన్‌ రెడ్డిని ఏమీ ఏమి చేయలేరన్నారు. తమ పొత్తు ప్రజలతోనే అని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రత్నజ్యోతి, ఎంపిపి పటాపంజుల కోటేశ్వరమ్మ, జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ వసుంధర, వైసిపి మండల అధ్యక్షుడు మల్లవరపు రాఘవరెడ్డి, రాష్ట్ర ఎంబిసి, ఎస్‌సి కార్పొరేషన్‌ డైరెక్టర్లు పుట్టా వెంకట్రావు, లింగంగుంట రవిబాబు, జెసిఎస్‌ కన్వీనర్‌ చింతపల్లి హరిబాబు, ఎపిఒ సుభాషిణి, సర్పంచులు ఉప్పలపాటి శివరామరాజు, నీలి సుబ్బారావు, తాళ్లూరి ఆశీర్వాదం, బిళ్ళా ఝాన్సీ రాణి, రావూరి స్నేహ, మల్లవరపు పేరమ్మ, మద్దిరాల మమత, వైస్‌ ఎంపిపి సుమన్‌ రెడ్డి, ఎంపిటిసిలు కొమ్ము ప్రభుదాసు, కసుకుర్తి కోటేశ్వరరావు పాల్గొన్నారు. కొండపి : పేదల సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి థ్యేయమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, వైసిపి కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో వైఎస్‌ఆర్‌ పెన్షను కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అర్హులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఎంపిడిఒపై మంత్రి ఆగ్రహంఎంపిడిఒ రమణమూర్తి పై మంత్రి సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛనుదారులతో ముఖాముఖి నిర్వహించాలని మంత్రి సూచించగా ఎంపిడిఒ స్పందించకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రే నేరుగా లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి మారెడ్డి అరుణవెంకటాద్రిరెడ్డి, వైసిపి మండల అధ్యక్షుడు ఆరికట్ల కోటిలింగయ్య, కొండపి సొసైటీ అధ్యక్షుడు బి.ఉపేంద్రచౌదరి, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు. చీమకుర్తి : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిదేనని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లివెంకాయమ్మ తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రాఘవేంద్ర, ఎంపిపి యద్దనపూడి శ్రీనివాసరావు, జడ్‌పిటిసి వేమా శ్రీనివాసరావు, వైసిపి మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ గోపురపు రాజ్యలక్ష్మి, ఎంపిటిసిలు, కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️