లింగ నిర్థారణకు పాల్పడితే చర్యలు

Jan 5,2024 21:55
ఫొటో : మాట్లాడుతున్న అధికారులు

ఫొటో : మాట్లాడుతున్న అధికారులు
లింగ నిర్థారణకు పాల్పడితే చర్యలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : లింగనిర్థారణ పరీక్షలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డి.సి.పి.ఎన్‌.డి.టి జిల్లా ప్రోగ్రాం అధికారులు బి.శ్రీనివాసరావు, డిఇఎంఒ, కనక రత్నం డివై.డిఇఎంఒలు పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం.పెంచలయ్య ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని డాక్టర్‌ బిఎస్‌ఆర్‌ హాస్పిటల్‌, కెకెఆర్‌ హాస్పిటల్‌, అభిరామ్‌ హాస్పిటల్‌, నిత్య డయాగ్నొస్టిక్స్‌ స్కాన్‌, గవర్నమెంట్‌ హాస్పిటల్‌ (డిహెచ్‌) స్కానింగ్‌ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కానింగ్‌ కేంద్రాలు నిర్వహిస్తున్న రికార్డులు నిశితంగా పరిశీలించారు. లింగ నిర్థారణ పరీక్షలకు పాల్పడితే పిసి అండ్‌ పిఎన్‌డిటి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధరల పట్టిక, బోర్డులు, యాక్ట్‌ పుస్తకం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రతినెలా తప్పకుండా ప్రతి గర్భిణీకి సంబంధించిన అమ్మాయి వివరాలను ఫారం-ఎఫ్‌లో సంబంధిత రిపోర్టర్‌లో నమోదు చేయాలన్నారు. ఆ రికార్డులను తప్పనిసరిగా రెండు సంవత్సరాలు భద్రపరచాలని ఆదేశించారు. తనిఖీలలో డిఇఎంఒ సిబ్బంది, డాక్టర్‌ మేకపాటి దీప్తి ఉన్నారు.

➡️