లెండిలో 5జి సాంకేతికత పై అవగాహన

ప్రజాశక్తి- డెంకాడ : లెండి ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం 5జి సాంకేతికతపై అవగాహన సదస్సు నిర్వహించారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా విజయనగరంలో టెలికాం వినియోగదారులకు వారి హక్కులు, అధికారాల గురించి లెండి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీతో సమన్వయంతో అవగాహన కల్పించేందుకు టెలికాం వినియోగదారుల ఔట్రీచ్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. న్యూఢిల్లీ ట్రారు బిబి అండ్‌ పిపి సలహదారు సంజీవ్‌ కుమార్‌ శర్మ 5జీ టెక్నాలజీ పాత్ర గురించి క్లుప్తంగా వివరించారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు సమకూర్చుకొని తమ లక్ష్యాల సాధనకు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. 6జి టెక్నాలజీపై ఇప్పటికే పరిశోధనలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ టెలికమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ ప్రతినిధి బి ప్రవీణ్‌కుమార్‌, లెండి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.వెంకట రామారెడ్డి, ఐటిఎస్‌ జాయింట్‌ అడ్వైజర్‌ రాజు, ఎపి డాట్‌ డైరెక్టర్‌ జివి మనోజ్‌ కుమార్‌, విజయనగరం సైబర్‌ క్రైమ్‌ సిఐ ఎం. ప్రశాంత్‌ కుమార్‌, సీనియర్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌ ఎం వెంకటపతి, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఎం. రాజన్‌ బాబు, అర్‌అండ్‌ డి డీన్‌ డాక్టర్‌ డి.నరేష్‌ కుమార్‌, డాక్టర్‌ ఎస్‌.శ్రీధర్‌, డాక్టర్‌ ఎవి పరంకుశం, డాక్టర్‌ బి.శ్రీధర్‌ ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

➡️