లేబర్‌ అధికారిని సస్పెండ్‌ చేయాలి:సిఐటియు

Feb 23,2024 21:22

ప్రజాశకి – నెల్లిమర్ల :మిమ్స్‌ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్న లేబర్‌ కమిషనర్‌ని వెంటనే సస్పెండ్‌ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మి నేని సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం విశాఖపట్నం జేసిఎల్‌ వద్ద చర్చలు అని చెప్పి సిఐటియులో ఉన్న ఉద్యోగులు, కార్మికులతో చర్చికుండా యాజమాన్యం, తనకు అనుకూలంగా ఉన్న 4గురుతో చర్చలకు పిలవడంలో లేబర్‌ అధికారులు ఎవరు పక్షాన ఉన్నారో అర్ధం అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా లేబర్‌ కమిషనర్‌ మిమ్స్‌ యాజమాన్యానికి కొమ్ము కాయడం పై నిరశన వ్యక్తం చేసి ధర్నా నిర్వహించారు. తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ మిమ్స్‌ ఉద్యగులు, కార్మికులు అందరూ ఒక తాటిపై వచ్చి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఐక్యంగా పోరాడుతున్నారన్నారు. యాజమాన్యం ఉద్యోగుల పక్షాన అలోచించి పరిష్కారం చేయాలన్నారు. మిమ్స్‌ యాజమాన్యం, లేబర్‌ అధికారులు నిర్వహించే చర్చలకు రాకుండా కార్మిక చట్టాలను, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుందన్నారు. ఉద్యోగులను తల్లిదండ్రుల వలే చూసుకుటున్నాం అంటున్న యాజమాన్యం నేటికీ జనవరి నెల జీతం ఇవ్వకపోవడం పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే గ్రామాల నుంచి కుటుంబ సభ్యులతో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షులు టివి రమణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, ఉద్యోగులు మిరప నారాయణ, కర్రోతు కాము నాయుడు, మహంతి నాగభూషణం, మధు, మూర్తి, రాంబాబు, గౌరీ, వరలక్ష్మి, రామకృష్ణ, బంగారునాయుడు, నాగేశ్వరావు, రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️