వందలాది ఎకరాలలో నేలకొరిగిన అరటి

పజాశక్తి-రైల్వేకోడూరు మండలంలో గత మూడు రోజులుగా మిచౌంగ్‌ తుపాన్‌ కారణంగా 469 మంది రైతులకు చెందిన 839 ఎకరాలలో అరటి పంట నేలకొరిగింది. అనంత రాజుపేట-1 పరిధిలో 23 మంది రైతులకు చెందిన 45 ఎకరాలలు, బొజ్జ వారిపల్లెలో ముగ్గురు రైతులకు చెందిన మూడు ఎకరాలలో,అనంతరాజుపేట-2 పరిధిలో ముగ్గురు రైతులకు చెందిన నాలుగు ఎకరాలలో, ఉర్లగట్టుపోడులో 25 మంది రైతులకు చెందిన 60 ఎకరాలలో, రాఘవరాజుపురంలో 45 మందికి చెందిన 61 ఎకరాలలో, విపిఆర్‌ కండ్రికలో 180 మంది రైతులకు చెందిన 260 ఎకరాలలో, గంగరాజుపోడులో 21 రైతులకు చెందిన 40 ఎకరాలలో, ఉప్పరపల్లెలో 55 మంది రైతులకు చెందిన 110 ఎకరాలలో అరటి నేలకూలింది. యానాదిపల్లెలో ఆరుమంది రైతులకు చెందిన 15 ఎకరాలలో, శెట్టిగుంటలో ఇద్దరు రైతులకు చెందిన రెండు ఎకరాలలో, వెంకటరెడ్డిపల్లెలో 20 మంది రైతులకు చెందిన 59 ఎకరాలలో, మైసూర్‌వారిపల్లెకు చెందిన నలుగురు రైతులకు చెందిన ఆరు ఎకరాలలో, ఓబనపల్లె 1,2లో 18 మంది రైతులకు చెందిన 30 ఎకరాలలో, రెడ్డివారిపల్లెలో 16 మంది రైతులకు చెందిన 22 ఎకరాలలో,16 మంది రైతులకు చెందిన 27 ఎకరాలలో రైతులు నష్టపోయారు. వివికండ్రికలో 12 మంది రైతులకు చెందిన 15 ఎకరాలలో,అరటిపంట నేలకొరిగింది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగుచేసి తీరా పంట కోతకు వచ్చే సమయానికి తుపాను కారణంగా పంట నష్టపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం నామమాత్రంగా పంట నష్టపరిహారం అందిస్తుందని ఇది ఏ మూలకు చాలాదని పంట నష్టపరిహారం పెంచి ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్యలు శరణ్యమని రైతులు వాపోతున్నారు.

➡️