వడదెబ్బ నుంచి ప్రజలను కాపాడాలి:డిఎంహెచ్‌ఒ

ప్రజాశక్తి-గాలివీడు వాతావరణంలో ఎండ వేడిమి పెరిగినందున ప్రజలను చైతన్య వంతులను చేసి వడదెబ్బ మరణాలు జరగకుండా కాపాడుదామని డిఎం హెచ్‌ఒ డాక్టర్‌ ఎన్‌.కొండయ్య వైద్య ఆరోగ్య సిబ్బందికి తెలిపారు.రాష్ట్ర వ్యా ప్తంగా నెలలో మొదటి మంగళవారం జరిగే ఆశాడే సమావేశాల్లో భాగంగా గాలివీడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న సమా వేశాన్ని డియంహెచ్‌ఒ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడదెబ్బ గురించి అవగాహన కల్పించారు. ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుందని,చాలా వేడియైన వాతావరణం లేదా చురుకైన పనుల వలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు వడదెబ్బ సంభవిస్తుందని అన్నారు. వడదెబ్బ సమయంలో అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువగా గురికావడం వల్ల వేడి అలసటకు దారితీస్తుందని చెప్పారు.హైపర్‌ థెర్మియా అంటే సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువ కలిగించే వేడికి ఎక్కువ కాలం గురికావడం వల్ల శరీర వేడిని నియంత్రించే సామర్థ్యం తీవ్రంగా తగ్గుడమని అన్నారు. హైపర్‌ థెర్మియాతో పాటు మారిన మానసిక ప్రవర్తన, చెమట, వికారం, వాంతులు, ఎర్రబడిన చర్మం, వేగవంతమైన శ్వాస, అధిక హదయ స్పందన రేటు లేదా తలనొప్పి వంటివి వడదెబ్బకు సూచి కలని, ఒకవేళ వడదెబ్బగా అనుమానించినట్లయితే, తక్షణ వైద్య సహాయం కొరకు 108 కాల్‌ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే పిల్లలు, వద్ధులు అధిక శారీరిక శ్రమ చేసే వారిలో లేదా ఎక్కువ గంటలు ఎండకు బయట తిరిగే వ్యక్తులు కొన్ని రక ముల గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులు బిపి ఔష ధాలు, యాంటిడిప్రెసెంట్స్‌, ఓవర్‌ ది కౌంటర్‌ దగ్గు మరియు జలుబు ఔష ధాలు వంటి ఔషధాలు ఉపయోగించేవారిలో వడదెబ్బ గురి కావచ్చని తెలి పారు. కండరాల తిమ్మిరి, భారీ చెమట పట్టడం, విపరీతమైన బలహీ నత, తలనొప్పి వాంతి, అధిక హదయ స్పందన, ముదురు రంగు మూత్రం, పాలిపోయిన చర్మం వడదెబ్బ లక్షణాలుగా గుర్తించాలని తెలి పారు.ఈ లక్షణాల్లో దేనినైనా మీరు అనుమానించినట్లయితే తక్షణ కార్యా చరణ ప్రణాళికను అనుసరించాలని తెలిపారు. రోగిని నీడగా, చల్లగా ఉండే ప్రదేశానికి తరలించాలని తెలిపారు.చుట్టూ గుంపులు గుం పులుగా ఉండ కూడదని చల్లని షవర్‌, చల్లని నీటితో స్పాంజ్‌, ఐస్‌ ప్యాక్‌ లతో నుదురు, మెడ, శరీరాన్ని తడి టవల్‌ తో తుడవాలని తెలిపారు. వడదె బ్బను నివారిం చడానికి వదులుగా ఉండే, తేలికపాటి, లేత రంగు దుస్తులను ధరించాలని చల్లని ద్రవాలు తాగలని, నిర్జలీ కరణానికి గురికా కుండా నిరోధించాలని ఆల్కహాల్‌ తీసుకోవడంతో త్వరగా డీహైడ్రేట్‌ చేస్తుం దని అన్నారు. దోస కాయ, పుచ్చకాయలు, దానిమ్మ, అరటిపండు వంటి పండ్లను తినాలని చెప్పారు. వదులుగా ఉండే దుస్తులు, టోపీ, సన్‌ గ్లాసెస్‌, సన్‌ స్క్రీన్‌, సన్‌ బర్న్‌ నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదికారిణి డాక్టర్‌ రాదా మాధవి, ఎఎన్‌ఎంలు సుశీలజోతి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. కలికిరి:వడదెబ్బ, వడ గాలులకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దామని జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ లోకవర్ధన్‌ అన్నారు. మంగళవారం మండలంలోని మెడికుర్తి పిహెచ్‌సిలో నిర్వహిస్తున్న ఆశ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరిగి మెదడు మీద ప్రభావం చూపుతుందని, దీనివలన మెదడు లోని ఉష్ణోగ్రతలు నియంత్రించే కేంద్రం దెబ్బతిని వడదెబ్బకు గురి అవుతారని దీనినే సన్‌ స్ట్రోక్‌ అంటారని తెలిపారు. గొడుగు వాడటం, తెలుపు రంగు, పలుచటి చేనేత వస్త్రాలు ధరించడం, తలకు టోపీ లేదా తువ్వాలు కట్టుకొనుట .వేడి గాలులు తగలకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మహమ్మద్‌ రఫీ, సిహెచ్‌ఒ ఇందిర, సబ్‌ యూనిట్‌ అధికారి ముజీబ్‌, పర్యవేక్షకులు హేమలత, ఎంఎల్‌హెచ్‌పిలు, ఎఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️