వాటర్‌ కూలర్‌ బహూకరణ

ప్రజాశక్తి-పిసిపల్లి : మండల పరిధిలోని నేరేడుపల్లి గ్రామానికి చెందిన చీమలదిన్నె మాలకొండయ్య, నారాయణమ్మ స్థానిక ఉన్నత పాఠశాలకు రూ.13వేల విలువైన వాటర్‌ కూలర్‌ను శుక్రవారం బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుమారుడు ఈ పాఠశాలలో చదుకున్నందుకు గుర్తుగా ఈ వాటర్‌ కూలర్‌ను అందజేసినట్లు తెలిపారు. కేసరి వెంకటరెడ్డి, ధనలకీë కుమారులు ప్రణీత్‌రెడ్డి, ప్రతీక్‌రెడ్డి నేరేడుపల్లి, స్థానిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులు పరీక్ష సామ్రగి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రనధానోపా ధ్యాయురాలు టి.అంజనీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

➡️